24 October 2013

Coffee reduce tendency for suicide,ఆత్మహత్యలకు 'కాఫీ' కళ్లెం



వాషింగ్టన్‌: రోజూ కాఫీ తాగితే ఆత్మహత్య ముప్పు సగానికి సగం తగ్గుతున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. కాఫీలోని కెఫీన్‌ మెదడులోని రసాయనాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు తెలిపారు. గతంలో జరిగిన మూడు పెద్ద అధ్యయనాలను తాజాగా సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తక్కువ కాఫీ తాగేవారితో, అసలే ఆ అలవాటులేని వారితో పోలిస్తే.. రోజుకి రెండు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగినవారికి ఆత్మహత్య ముప్పు 50% తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించటమే కాదు.. మెదడులో నాడీ సమాచారాన్ని చేరవేసే సెరటోనిన్‌, డొపమైన్‌ వంటి కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేయటం ద్వారా ఒక మాదిరి కుంగుబాటు నివారణిగానూ పనిచేస్తోందని పరిశోధకులు వివరించారు. కాఫీ తాగేవారికి కుంగుబాటు ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లో తేలిన సంగతిని ఇది విశ్లేషిస్తోందన్నారు. అయితే కుంగుబాటు బారినపడ్డవాళ్లు కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవాలనేది దీనర్థం కాదని పేర్కొన్నారు.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Treatment for Diabetes-joint pains with dental stem cells,మధుమేహం-కీళ్లనొప్పులకు దంతమూలకణాలతో చికిత్స

  •  



ముంబయి: దంతాల నుంచి సేకరించిన మూలకణాలతో పలురకాల వ్యాధులను నయం చేయవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా.. కణజాల, అవయవ సంబంధిత రుగ్మతలైన మధుమేహం, కీళ్లనొప్పులకు వీటితో చికిత్సను అందించవచ్చని తెలిపారు. ముంబయిలోని స్టిమేడ్‌ ప్రైవేట్‌ డెంటల్‌ స్టెమ్‌సెల్స్‌ బ్యాంక్‌కు చెందిన ఈ నిపుణులు.. మూడేళ్లుగా దంత మూలకణాలను సేకరించి భద్రపరుస్తున్నారు. వాటిని మైనస్‌ 150 డిగ్రీల వద్ద క్రయోజెనిక్‌ ట్యాంకుల్లో భద్రపరుస్తామని తెలిపారు. వ్యాధుల చికిత్సకు అవసరమైనప్పుడు.. ఆయావ్యక్తులు తమ దంతమూలకణాలను తిరిగి తీసుకొని వ్యాధుల నుంచి విముక్తి పొందుతున్నారని పేర్కొన్నారు.

  • ===========================
Visit my website at -> Dr.Seshagirirao.com/

Low cost Tea bad for health,చవకగా దొరికే తేనీరుతో ఆర్యోగానికి చేటు

  •  



లండన్‌: ఉల్లాసం కోసం తాగే తేనీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవు. చవకగా దొరికే తేనీటితో ఎముకలు, దంతాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. సూపర్‌ మార్కెట్టులో వివిధ బ్రాండ్‌ పేర్లతో లభించే తేనీటి మిశ్రమ పదార్థాలలో ఫ్లోరైడ్‌ ఉండి వాటిని ఎక్కువ మొత్తంలో వాడితే దంతాలు, ఎముకల సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. సూపర్‌ మార్కెట్టులలో లభించే 38 రకాల తేనీటి మిశ్రమాలను, అమెరికాకు చెందిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(ఎన్‌ఏఎస్‌)కు సంబంధించిన ఆహార నమూనాను ఆధారంగా తీసుకుని ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన వ్యక్తి అరాధన మెహ్ర కూడ పాలుపంచుకున్నారు. తేనీరు, డ్రై టీ, బ్లాక్‌, ఇతర రకాల తేనీటి కషాయాలను రెండు నిమిషాలు మరిగించి, సాధారణంగా రోజూ తీసుకునే తేనీటి సరాసరితో పోల్చి చూశారు. ఆ మిశ్రమాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్లోరైడ్లను గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన లారా చౌన్‌ తెలిపారు. బ్లాక్‌ టీకి సంబంధించిన మిశ్రమాన్ని పరిశీలిస్తే లీటర్‌లో ఉండాల్సిన ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఫ్లోరైడ్‌ గాఢత ఉన్నట్లుగా గుర్తించారు
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

New treatment for asthma,ఆస్థమాకు కొత్త చికిత్స




వాషింగ్టన్‌: వ్యాధిలో కీలక పాత్ర పోషించే ఎంజైమ్‌ గుర్తింపు. గుండె జబ్బులో పాత్ర ఉన్న ఒక ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆస్థమాకు మెరుగైన చికిత్స చేయవచ్చని అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సీఏఎంకే2 అనే ఈ ఎంజైమ్‌కు శ్వాసమార్గంలో ఆక్సీకరణానికి సంబంధించిన హానికారక ప్రభావాలతో సంబంధం ఉందని వీరు గుర్తించారు. ఇది ఆస్థమా లక్షణాలను ప్రేరేపిస్తుందని తెలిపారు. సీఏఎంకేఈ2ను లక్ష్యంగా చేసుకొని మందులు తయారుచేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని తెలిపారు.

ఆస్థమా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని పీడిస్తోంది. అయినా చికిత్స పరంగా స్టెరాయిడ్లు మాత్రమే ఉంటున్నాయి. వీటివల్ల ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రస్తుత చికిత్స విధానాలు సరిగా పనిచేయడంలేదని పరిశోధనలో పాలుపంచుకున్న మార్క్‌ ఆండర్సన్‌ తెలిపారు. సీఏఎంకే2ను అడ్డుకోవడం ద్వారా అలర్జిక్‌ ఆస్థమాకు మెరుగైన చికిత్స చేయవచ్చని వివరించారు. ఈ ఎంజైమ్‌.. గుండె కండరాల కణాల ఆక్సీకరణంలో కీలక పాత్రషోషిస్తోందని, దీనివల్ల గుండె జబ్బులు, గుండెపోటు వస్తోందని లోగడ తేలిందన్నారు. శ్వాసకోశ వ్యవస్థ ఆక్సీకరణంలోనూ దీనికి పాత్ర ఉండొచ్చని తమకు అనిపించిందని తెలిపారు. తొలుత వీరు ఈ ఎంజైమ్‌ను ఎలుకల శ్వాసనాళ కండర కణాల్లో పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఆ తర్వాత ఎంజైమ్‌ను శ్వాస నాళం లైనింగ్‌ (ఎపిథీలియల్‌) కణాల్లో పరీక్షించారు. ఎంజైమ్‌ను అడ్డుకున్న ఎలుకల్లో సీఎఎంకే2 ఆక్సీకరణం తక్కువగా ఉందని గుర్తించారు. వీటిలో శ్వాసనాళం కండరం కుంచించుకుపోవడంగానీ, ఆస్థమా లక్షణాలు గానీ కనిపించలేదు. ఎంజైమ్‌ను అడ్డుకోని ఎలుకల్లో మాత్రం ఆక్సీకరణ ఒత్తిడి ఎక్కువగా ఉందని. ఫలితంగా శ్వాసనాళం కుంచించుకుపోయి ఆస్థమా లక్షణాలు కనిపించాయి.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Device to detect disolved fat,కరిగే కొవ్వును తెలిపే పరికరం

  •  







  •  
టోక్యో: ఫిట్‌నెస్‌ కోసం తీవ్రంగా శ్రమించేవారు.. ఎప్పటికప్పుడు ఫలితాన్ని తెలుసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. బరువు కొలిచే యంత్రాలతో అవసరం లేకుండానే ఈ పని చేయొచ్చు. శరీరంలో ఎంతమేర కొవ్వు కరిగిందనేది అప్పటికప్పుడు తక్షణమే వెల్లడించే కొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. జేబులో పట్టేంత పరిమాణంలో ఉండే ఈ ప్రత్యేక పరికరాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. ఇందులో ఉండే సెన్సర్‌ ఒక వ్యక్తి వ్యాయామం సందర్భంగా ఎంతమేర కొవ్వును కరిగించాడనేది గుర్తిస్తుందని పేర్కొన్నారు. శ్వాసలో వెలువడే అసిటోన్‌ స్థాయులను కొలవడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. కొవ్వు కరిగినప్పుడు రక్తంలో అసిటోన్‌ ఉత్పత్తి జరుగుతుంది. అది ఊపిరితిత్తుల్లో సూక్ష్మతిత్తుల గుండా విడుదలవుతుంది. శ్వాస వదిలినప్పుడు బయటికి వస్తుంది. ఎన్‌టీటీ డొకోమో రీసెర్చి ల్యాబరేటరీస్‌కు చెందిన పరిశోధకులు ఈ పరికరాన్ని రూపొందించారు. నిశ్వాసను గుర్తించేందుకు ఇందులో ఒత్తిడి సెన్సర్‌ ఉంటుంది. అసిటోన్‌ను గుర్తించేందుకు రెండు రకాల సెమీకండక్టర్‌ ఆధారిత గ్యాస్‌ సెన్సర్లు ఉంటాయి. ఒక వ్యక్తి శ్వాస వదలగానే పరికరం అసిటోన్‌ గాఢత స్థాయులను లెక్కించి 10 క్షణాల్లో స్మార్ట్‌ఫోన్‌కు వివరాలను పంపుతుంది.(6:48 PM 24-Oct-13)
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Breast feeding prevent mother from depression,పిల్లలకు పాలిస్తే తల్లుల్లో కుంగుబాటు దూరం

  •  


  •  
లండన్‌: పిల్లలకు పాలివ్వటం తల్లులకూ మేలు చేస్తుందని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నదే. ఇప్పుడు దీని గురించి మరో కొత్త సంగతి బయటపడింది. పిల్లలకు పాలివ్వటం వల్ల తల్లుల మెదడులో విటమిన్‌ ఏ పోగుపడటం ఆగుతుందని, ఫలితంగా వీరికి కుంగుబాటు ముప్పూ తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు విటమిన్‌ ఏ అందుతుందని జాక్సన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. లేకపోతే బాలింతల మెదళ్లలో విటమిన్‌ ఏ పేరుకొని కుంగుబాటును ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. పిల్లల ఎదుగదలకు విటమిన్‌ ఏ ఎంతో అవసరం. అందువల్ల ఇది గర్భిణుల్లో పెద్ద మోతాదుల్లో నిల్వ ఉంటుంది. ఒకవేళ కాన్పు తర్వాత తొలినాళ్లలో తల్లులు శిశువులకు పోతపాలు పడితే కుంగుబాటుకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరించారు. సుమారు 80% మంది బాలింతలు స్వల్ప కుంగుబాటు బారినపడే అవకాశముంది. ఇందుకు హార్మోన్ల మార్పులు దోహదం చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కుంగుబాటు బారినపడటం, వేధింపులు లేదా మానసిక అస్వస్థత, పొగ తాగటం, మద్యం అలవాటు వంటివీ దీనికి తోడ్పడతాయి.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Flu vaccine good for Heart,ఫ్లూ టీకాతో గుండెకూ మేలు





టొరంటో: ఫ్లూ టీకా వేసుకుంటే ఇన్‌ఫ్లూయెంజా మూలంగా వచ్చే తీవ్ర సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చని తెలిసిందే. దీని గురించిన మరో మంచి విషయం తాజాగా బయటపడింది. ఇది గుండెజబ్బు బారినపడ్డవారిలో పక్షవాతం, గుండెపోటు ముప్పులనూ సగానికి తగ్గిస్తున్నట్టు టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. మరింత శక్తిమంతమైన టీకా తీసుకున్నవారికి ఈ రక్షణ ఇంకా ఎక్కువగా లభిస్తున్నట్లూ తేలింది. గుండెజబ్బు గలవారికి ఫ్లూ టీకా గుండెపోటు రాకుండా కాపాడుతున్నట్టు తమ పరిశోధన ఫలితాలు గట్టిగా చెబుతున్నాయని అధ్యయన నేత డాక్టర్‌ జేకబ్‌ ఉడెల్‌ తెలిపారు. అయితే గుండెపోటు ముప్పును తగ్గించే చికిత్సగా ఫ్లూ టీకాను ఇవ్వచ్చో లేదో అనేదానిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు

source : Eenadu News paper -6:32 AM 10/24/2013
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Coffee protect Liver,కాలేయానికి కాఫీ రక్ష




వాషింగ్టన్‌: రోజుకి మూడు కప్పుల కాఫీ తాగితే.. కాలేయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 50 శాతానికి పైగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగే కాలేయ క్యాన్సర్‌ రకాలలో ఎక్కువగా కనబడే హెపటోసెల్యులార్‌ కార్సినోమా (హెచ్‌సీసీ) ముప్పూ సుమారు 40% మేరకు తగ్గుతున్నట్టు వెల్లడైంది. ప్రపంచంలో అతి ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో కాలేయ క్యాన్సర్‌ ఆరోది. మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది మూడోది. కాఫీ ఆరోగ్యానికి.. ముఖ్యంగా కాలేయానికి మంచిదనే గత అధ్యయనాలను తమ పరిశోధన మరింత బలపరిచిందని అధ్యయన నేత కార్లో లా వెచియా తెలిపారు. కాఫీలో మధుమేహ నివారణకు, కాలేయం గట్టిపడకుండా చేసే గుణాలు ఉన్నాయని.. ఇవే కాలేయ క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.

source : Eenadu News paper -6:32 AM 10/24/2013
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

smoking in pregnancy bad to babies,గర్భిణుల ధూమపానం చిన్నారులకు ప్రాణాంతకం




వాషింగ్టన్‌: గర్భిణులు కనుక విపరీతంగా పొగ తాగేస్తే...పుట్టబోయే పిల్లల్లో పలు ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లు పిల్లలను బాధిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.చాలా సందర్భాల్లో తల్లుల ఈ దురలవాటు పిల్లల మృతికి కారణమవుతున్నట్లు పేర్కొంది. తల్లుల కుండే పొగతాగే అలవాటు ...చాలా సందర్భాల్లో పిల్లలకు ప్రాణాంతకమౌతోందని హెచ్చరించింది. 1987-2004 మధ్య కాలంలో జన్మించిన శిశువుల వైద్య రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట తామీ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. మొత్తం 50వేల మంది పిల్లల వైద్యరికార్డులను పరిశీలించామన్నారు. తల్లి ధూమపానం అలవాటు పర్యవసానంగా ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల వైద్యరికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు.

source : Eenadu News paper -6:32 AM 10/24/2013
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Aids detecting application cum genr reader,గంటలో ఎయిడ్స్‌ను గుర్తించే మొబైల్‌ పరికరం

  •  

  •  


వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన నానో టెక్నాలజీ సంస్థ తక్కువ ఖర్చుతో గంట వ్యవధిలోనే ఎయిడ్స్‌ నిర్ధరించే పరికరాన్నీ, యాప్‌ను రూపొందించింది. ఈ సంస్థకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహించడం విశేషం. రక్తం, లాలాజలం లేదా శరీరంలోని ఇతర ద్రవాలను ఒక్క బొట్టు తీసుకుని నానోచిప్‌పై వేసి, 'జీన్‌-రీడర్‌'గా పిలిచే ఈ పరికరంలో పెడితే సరిపోతుంది. డాక్టర్‌ అనితాగోయెల్‌ ఛైర్మన్‌, సీఈవోగా వ్యవహరిస్తున్న బోస్టన్‌లోని 'నానోబయోసిమ్‌' సంస్థ ఈ పరికరాన్ని రూపొందించింది. తమ పరికరం 'గోల్డ్‌స్టాండర్డ్‌' పరీక్షను నిర్వహిస్తుందన్నారు. అమెరికాలో ఈ పరీక్షకు కనీసం రెండు వారాలు పట్టడమే కాకుండా, వ్యయం కూడా ఎక్కువే. జీన్‌-రీడర్‌ పరికరంతో చేపట్టే పరీక్ష తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని అనిత చెప్పారు

source : Eenadu new paper 24.Oct.2013
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

20 October 2013

colon cance with Sweets,తీపిపదార్థాలతో పేగు కేన్సర్‌

  •  







  •  
లండన్‌: బాగా తియ్యగా ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేకులు, డ్రింకులు, క్రిస్పీలు, డెజర్ట్‌లు, బిస్కట్లు వంటివి మితిమీరి తింటే ఈ ప్రమాదం పొంచిఉంటున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. అబెర్‌దీన్‌, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీంట్లో భాగంగా రెండువేలమంది పేగు కేన్సర్‌ బాధితుల ఆహార అలవాట్లను పరిశీలించారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Camera recording of heart and breath rates,గుండె, శ్వాసక్రియ రేట్లను గుర్తించే కెమేరా

  •  



  •  
వాషింగ్టన్‌: సంక్లిష్ట అల్గారిథమ్‌లతో కూడిన సాధారణ వీడియో కెమేరా గుండె, శ్వాసక్రియ రేట్లను నిర్దిష్టంగా గుర్తించడంలో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో కీలక సంకేతాలను గుర్తించే విషయంలో ఇది చవకైన పద్ధతి అనీ, రోగిని తాకుండానే వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు. టెలిమెడిసిన్‌ ప్రక్రియలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. గుండెపోటు, పక్షవాతం వంటివాటిని ఇంటివద్దే గుర్తించడంలోనూ, ఆకస్మిక శిశు మరణాల వంటి సమస్యను నిర్ధరించడంలోనూ తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనేది గుండె, శ్వాసక్రియ రేట్లే చెబుతాయని జార్జియా రీజెంట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్‌ జో సియెన్‌ పేర్కొన్నారు. తాము రూపొందించిన అల్గారిథమ్‌లు వేగంగా, నిక్కచ్చిగా అంచనా వేస్తాయని స్పష్టం చేశారు. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా పలువురు ప్రముఖుల టీవీ దృశ్యాలను తమ పరికరంతో పరీక్ష చేసి చూశారు.(6:24 PM 20-Oct-13)
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Alcohol detection breath test , తాగుబోతు చోదకులను గుర్తించే కొత్త తరహా శ్వాస పరీక్ష పరికరం




వాషింగ్టన్‌: తాగి బండి నడిపే చోదకులను గుర్తించేందుకు కొత్తరకం చవకైన పరీక్ష పరికరాన్ని పరిశోధకులు తీర్చిదిద్దారు. శ్వాసను పరీక్షించినప్పుడు ఆల్కహాలు అధికమోతాదులో తాగి ఉంటే ఈ పరికరంలో పచ్చలైటు, వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతోంది. ఇప్పుడున్న శ్వాసపరీక్ష పరికరాలన్నీ ఖరీదైనవనీ, ఆల్కహాల్‌ సాంద్రతను నిక్కచ్చిగా గుర్తించలేవని పరిశోధకులు పేర్కొన్నారు. కొత్త పరికరంలోని సెన్సర్‌ను తిరిగి ఉపయోగించవచ్చనీ, ఇది డిజిటల్‌ రూపంలోనూ ఫలితాన్నీ చూపుతుందని చెబుతున్నారు. రహదారుల పక్కన పోలీసులు ఉపయోగించే పరికరాల్లో లేని సౌకర్యాలు వీటిలో ఉంటాయనీ, ఆల్కహాలు మోతాదు చట్టపరంగా అనుమతించని స్థాయిలో ఉందా అనే విషయాన్ని వెంటనే తేల్చేస్తాయని ఇటలీకి చెందిన పరిశోధకులు రికార్డో పెర్నిస్‌ పేర్కొన్నారు.(6:08 PM 10-Oct-13)
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Repair of Tissue with blood vessel cells,రక్తనాళ కణాలతో అవయవాల మరమ్మతు





న్యూయార్క్‌: దెబ్బతిన్న లేదా జబ్బు బారిన పడిన అవయవాలను రక్తనాళ కణాలతో మరమ్మతు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవయవ దానం, అవయవ మార్పిడి వంటివి అవసరం లేకుండానే ఈ పద్ధతిలో చికిత్స జరిపే వీలుంది. రక్తకణాల నిర్మాణాన్ని తీర్చిదిద్దే ఎండోలీథియల్‌ కణాలు శక్తిమంతమైన జీవ యంత్రాల్లాంటివి. ఇవి ప్రయోజనకరమైన, అవయవ సంబంధ పరమాణువులను విడుదల చేయడం ద్వారా అవయవాల కణజాల పునరుత్పాదనను ప్రేరేపిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎండోలీథియల్‌ కణాల్లోని క్రియాశీలక జన్యువులను డీకోడింగ్‌ చేయడం ద్వారా ఈ అంశాన్ని గుర్తించారు. అవయవాలు తమ రక్తనాళాలు, వాటి మరమ్మతు పరమాణువులను నిర్దేశిస్తాయన్న విషయాన్నీ ఈ పరిశోధనలో గుర్తించారు. తీర్చిదిద్దిన ఎండోలీథియల్‌ కణాలను ఇంజక్షన్‌ ద్వారా శరీరంలోకి అవసరమైన చోట ఎక్కించినప్పుడు గాయపడిన కణజాలంలోకి వెళ్లి, అవయవానికి మరమ్మతు సామర్థ్యాన్ని పెంచుతాయని అన్సారీ స్టెమ్‌సెల్‌ ఇనిస్టిట్యూట్‌, ట్రైసై స్టెమ్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ప్రొఫెసర్‌ షహీన్‌ రఫీ పేర్కొన్నారు.(6:05 PM 10-Oct-13)
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Enzyme acting as double edged Knife,రెండురకాలుగా వ్యవహరిస్తున్నఎంజైమ్‌




వాషింగ్టన్‌: హెచ్‌ఐవీ వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను ఎదుర్కొని శరీరానికి రక్షణ కల్పించే ఒక ఎంజైమ్‌.. కేన్సర్‌కు కారణమవుతోందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సదరు ఎంజైమ్‌ వల్ల జరిగే డీఎన్‌ఏ ఉత్పరివర్తనాలు చివరికి కేన్సర్‌కు దారి తీస్తున్నాయని వారి పరిశోధనలో వెల్లడైంది. మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ఈ శాస్త్రవేత్తలు 'ఏపీఓబీఈసీ3బీ' అనే ఎంజైమ్‌ పలు రకాల కేన్సర్లకు కారణమవుతోందని గుర్తించారు. ఈ పరిశోధకులు 19 రకాల కేన్సర్‌ కణితుల నమూనాలను విశ్లేషించి.. వాటిల్లో 'ఏపీఓబీఈసీ3బీ' ఎంజైమ్‌ ఉందా లేదా అన్నది పరిశీలించారు. ఈ మేరకు వారికి.. మూత్రాశయం, గర్భాశయం, తల, మెడ, రొమ్ముతోపాటు రెండురకాల వూపిరితిత్తుల కేన్సర్లలో 'ఏపీఓబీఈసీ3బీ' ఎంజైమ్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి, ఈ ఎంజైమ్‌ ఆరోగ్యంగా ఉండే కణజాలాలన్నింటిలోనూ తక్కువ మోతాదులో కనిపిస్తుంది. కానీ, కేన్సర్‌ కణజాలంలో మాత్రం దీని మోతాదు ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే 'ఏపీఓబీఈసీ3బీ' ఎంజైమ్‌ హెచ్‌ఐవీ వంటి ప్రమాదకరమైన వైరస్‌ల నుంచి ఆరోగ్యవంతమైన కణాల్ని కాపాడుతుంది. ఓవైపు ఈ విధంగా రక్షణ కల్పిస్తూనే ఇది కేన్సర్‌కు కారణమవుతుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఈ ఎంజైమ్‌ రెండువైపులా పదునున్న కత్తి వంటిదని, దీంతో లాభం ఉన్నట్లే, నష్టం కూడా ఉందని.. ఈ మేరకు దీనిని నియంత్రించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలంటున్నారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Fat genes change with exercise,వ్యాయామంతో 'కొవ్వు' జన్యువుల మార్పు


[Obesity+belly.jpg]
cycling as Exercise -------------------------------------------Fatty body ..genetical origin.
  •  
శరీరంలో ఎక్కువగా ఉన్న కేలరీలు ఖర్చు కావటానికి వ్యాయామాన్ని మించిన మార్గం లేదన్నది తెలిసిందే. కానీ దీని ప్రభావాలు మరింత లోతుగా.. ఆ మాటకొస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధానాన్నే మార్చేస్తుందని మీకు తెలుసా? ఆరునెలల పాటు సైక్లింగ్‌ లేదా ఏరోబిక్స్‌ వంటి వ్యాయామాలు చేస్తే.. కొవ్వు పేరుకుపోవటంలో, వూబకాయం రావటంలో పాలు పంచుకునే జన్యువుల పనితీరు మారిపోయినట్టు స్వీడన్‌ పరిశోధకులు గుర్తించారు. రక్తంలోని చక్కెరను కొవ్వు కణాల్లో పోగుపడేలా చేసే జన్యువుల పని వేగాన్నీ వ్యాయామం తగ్గిస్తున్నట్టు తేలింది. నిజానికి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యువులు జీవితాంతం మారటమంటూ ఉండదు. కానీ అన్ని జన్యువులు అన్ని సమయాల్లో చురుకుగా ఉండవు. కొన్ని కణాల్లో కొన్ని జన్యువులే చురుకుగా పనిచేస్తాయి. మెథీలేషన్‌ అనే ప్రక్రియ ఇలా జన్యువులు పనిచేయటాన్ని, ఆపేయటాన్ని నియంత్రిస్తుంది. వ్యాయామం వల్ల 7వేల జన్యువులు ప్రభావితం అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. శరీరంలో కొవ్వు పేరుకోవటానికి దోహదం చేసే జన్యువులూ ఇందులో ఉన్నాయి. వీటిల్లో రెండు కీలక జన్యువులు రక్తంలోని కొవ్వు ఆమ్లాల మోతాదులనూ తగ్గిస్తున్నట్టు తేలింది. వ్యాయామం వీటి పనితీరును మార్చటం ద్వారా శరీరంలో కొవ్వు పెరగకుండా చూస్తోందన్నమాట. రక్తంలో కొవ్వు మోతాదులు ఎక్కువుంటే మధుమేహం ముప్పు పొంచి ఉన్నట్టే. అందువల్ల వ్యాయామంతో మధుమేహం ముప్పు ఎందుకు తగ్గుతుందో అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని భావిస్తున్నారు. అలాగే ఈ జన్యువులను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మందుల రూపకల్పనకూ దారితీస్తుందని ఆశిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Diabetes increses chances of Alzemer,అల్జీమర్స్‌ ముప్పు పెంచే మధుమేహం

  •  


  •  
వాషింగ్టన్‌: ఒక సమస్య మరో సమస్యకు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహంతో అల్జీమర్స్‌ ముప్పు పెరిగే ముప్పుంటుందని స్పష్టం చేశారు. జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు స్కాట్‌ టర్నర్‌ తమ అధ్యయనంలో భాగంగా పలువురు అల్జీమర్స్‌ బాధితుల్ని పరిశీలించగా, వారిలో చాలామందిలో ముందస్తు మధుమేహం లక్షణాలు బయటపడ్డాయి. మధుమేహం అల్జీమర్స్‌ ముప్పును పెంచుతోందనీ, గ్లూకోజ్‌ సున్నితత్వాన్ని మెరుగుపరిస్తే.. మధుమేహం, అల్జీమర్స్‌ రెండింటినీ మరికొంత ఆలస్యం చేయవచ్చని టర్నర్‌ పేర్కొన్నారు. అల్జీమర్స్‌ బాధితులందరికీ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ పరీక్ష చేయించడం మేలని తమ అధ్యయనం ద్వారా అవగతమవుతోందని టర్నర్‌ స్పష్టం చేశారు.v
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

parents obesity inherit to children,తండ్రుల వూబకాయం పిల్లలకు






మెల్‌బోర్న్‌: తండ్రి వూబకాయుడైతే.. వారి పిల్లలకూ అధిక బరువు ముప్పు పొంచి ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో గుర్తించారు. స్థూలకాయుడైన తండ్రి శుక్రకణాల్లోని పరమాణు సంకేతాలు.. సంతానంలో రెండు తరాల వరకూ మధుమేహం తరహా లక్షణాలనూ, స్థూలకాయాన్నీ కలిగిస్తున్నట్లు అడిలైడ్‌ విశ్వవిద్యాలయం బృందం పరిశోధనలో వెల్లడైంది. చిన్నారులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఇలాంటి సమస్య తప్పటం లేదని గుర్తించారు. ఇలాంటి లంకెను గుర్తించడం తొలిసారి అని పరిశోధకులు టాడ్‌ ఫుల్‌స్టాన్‌ పేర్కొన్నారు. తండ్రి ఆహార అలవాట్లు వీర్యంలోని మాలిక్యులర్‌ మేకప్‌లో మార్పులకు దారితీస్తున్నట్లు వివరించారు. వూబకాయం కారణంగా.. తండ్రుల వీర్యం, మైక్రోఆర్‌ఎన్‌ఏ పరమాణువుల్లో మార్పులు తలెత్తడం వల్ల స్థూలకాయం దిశగా పిండంలోనే మార్పులు సంభవించడంగానీ లేదా జీవిత అనంతర కాలంలో జీవక్రియ వ్యాధికి కారణంగానీ కావచ్చని ఫుల్‌స్టాన్‌ వివరించారు. తండ్రికి మధుమేహం లేకపోయినా, తర్వాతి రెండు తరాలకు సంక్రమించే లక్షణం ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతానికి ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామనీ, తర్వాతి దశలో మనుషులపైనా పరిశీలిస్తామని చెప్పారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Lemon(citrus fruit) fights against liver cancer,కాలేయ క్యాన్సర్‌పై నిమ్మ పోరాటం

  •  



నారింజ, నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటిల్లోని లిమోలిన్‌ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది. దీన్ని కాలేయ క్యాన్సర్‌ బారినపడేలా సృష్టించిన ఎలుకలకు ఇచ్చినపుడు అవి జబ్బు నుంచి కోలుకున్నట్టు తేలింది. నిజానికి లిమోలిన్‌ నేరుగా కణితులపై పనిచేయటం లేదు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్‌పై పోరాడేలా తీర్చి దిద్దుతోంది. ఇది యాంటీఆక్సిడెంట్ల మోతాదునూ పెంచి, విశృంఖల కణాలను తగ్గిస్తున్నట్టూ బయట పడింది.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Urine test to detect gene of eye disease,మూత్రపరీక్షతో నేత్ర వ్యాధికి కారణమయ్యే జన్యువుల గుర్తింపు






వాషింగ్టన్‌: వారసత్వంగా వచ్చే ఓ నేత్ర వ్యాధికి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాన్ని మూత్రపరీక్ష ద్వారా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధితో దృష్టిలోపం, అంధత్వం వంటి సమస్యలూ తలెత్తుతాయి. ఫ్లోరిడాలోని బాస్కామ్‌ పామర్‌ నేత్ర కేంద్రానికిచెందిన పరిశోధకులు డాక్టర్‌ రాంగ్‌ వెన్‌, డాక్టర్‌ బైరాన్‌ ల్యామ్‌ డ్యూక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జిక్వియాంగ్‌ గువాన్‌తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో భాగంగా.. రెటినైటిస్‌ పిగ్మెంటోసా (ఆర్‌పీ) అనే కంటి వ్యాధితో బాధపడుతున్న కుటుంబం నుంచి సేకరించిన కణాలను విశ్లేషించారు. ఈ కుటుంబానికి చెందిన జీనోమ్‌ సీక్వెన్స్‌ను అంతకుముందే పూర్తిచేసి ఉండటంతో వాటితో పోల్చిచూశారు. ఈ విషయంలో రక్తపరీక్షలకన్నా మూత్రపరీక్షలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయనీ, 'డోలికాల్‌ ప్రొఫైలింగ్‌'లో మూత్రపరీక్ష మంచి ఫలితం ఇస్తున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Stomach hormones cures Obesity,పొట్ట హార్మోన్లతో స్థూలకాయం మాయం

  •  

  •  
మెల్‌బోర్న్‌: పొట్టలో ఉన్న రెండు హార్మోన్ల మోతాదును పెంచటం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన గార్వెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించారు. ఎలుకల్లోకి ''పీవైవై3-36'', ''పీపీ'' అనే రెండు రకాల హార్మోన్లను వారు పంపించారు. అనంతరం వాటిని పరిశీలించినప్పుడు.. ఎలుకలు అంతకుముందుకన్నా తక్కువగా తింటున్నాయని, వాటిలో కొవ్వు తక్కువగా పేరుకుపోయిందని, ఇన్సులిన్‌ నిరోధకత (మధుమేహానికి ముందు కనిపించే లక్షణం) అలవడలేదని వెల్లడైంది. సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట నిండినట్లు అనిపించగానే ఆ సందేశాన్ని పీవైవై3-36, పీపీ హార్మోన్లే మెదడుకు అందజేస్తుంటాయి. వీటివల్లే తినటాన్ని ఆపేస్తాం. ఈ హార్మోన్ల ఆధారంగా స్థూలకాయానికి మందులను తయారుచేయటానికి ఔషధ కంపెనీలు ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, వీటి ప్రభావం అణుస్థాయిలో మెదడుపై ఎలా ఉంటుందన్నది ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తొలిసారిగా తెలిసింది.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

19 October 2013

use of Calcium , క్యాల్షియం ఎముకలకే కాదు

  •  

  •  
 use of Calcium
 క్యాల్షియం ఎముకలకే కాదు..మన ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి క్యాల్షియం ఎంతో అవసరం. నాడీ సంకేతాల ప్రసారానికి, రక్తం గడ్డకట్టటానికి, గుండె చేసే పనుల్లో సహాయ పడటానికి, ఎంజైమ్‌లు పనిచేయటానికి కూడా క్యాల్షియం తోడ్పడుతుంది. ఇది ముఖ్యంగా చిన్నపేగుల ద్వారా శరీరానికి అందుతుంది.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Increase in Lifespan with walking,నడకతో ఆయుష్షు పెరుగుదల

  •  



  •  
నడక మంచి వ్యాయామనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది రక్తపోటు, గ్లూకోజు నియంత్రణలో ఉండటానికే కాదు.. ఆయుష్షు పెరగటానికీ తోడ్పడుతుందని మీకు తెలుసా? రోజుకి కేవలం 15 నిమిషాలు నడిచినా మంచి ఫలితం కనబడుతున్నట్టు, వీరికి క్యాన్సర్‌తో మరణం సంభవించే ముప్పు 10% తగ్గుతున్నట్టు బయటపడింది. అంతేకాదు.. ఎలాంటి కారణంతో వచ్చే మరణం ముప్పైనా 14% తగ్గుతున్నట్టు, జీవనకాలం మూడేళ్లు పెరుగుతున్నట్టు తేలింది. తైవాన్‌లో 4 లక్షలకు పైగా ప్రజలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఎక్కువ ప్రయోజనం కనబడుతోంది కూడా. ప్రతి 15 నిమిషాల అదనపు నడకతో (అంటే 15 నిమిషాలు నడిచేవారు 30 నిమిషాలు నడిస్తే) క్యాన్సర్‌తో వచ్చే మరణం ముప్పు మరో 1% ఎక్కువగా తగ్గుతుండగా.. ఇతర అన్ని కారణాలతో సంభవించే మరణం ముప్పు 4% అధికంగా తగ్గుతోంది. ఈ నడక ప్రయోజనాలు అన్ని వయసుల వారిలోనూ ఒకే విధంగా కనబడుతుండటం విశేషం. ఇక రోజుకి సగటున 6 గంటల పాటు టీవీ చూసేవారిలో జీవనకాలం ఐదేళ్లు పడిపోతున్నట్టు బ్రిటన్‌లో చేసిన మరో అధ్యయనంలో బయటపడింది. 25 ఏళ్లు పైబడినవారిలో టీవీ చూస్తూ గడుపుతున్న ప్రతి గంట కాలానికీ సుమారు 22 నిమిషాల ఆయుష్షు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. టీవీ చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు రెండు సిగరెట్లను కాల్చటంతో వాటిల్లే అనర్థాలతో సమానంగా ఉంటుండటం గమనార్హం.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

12 October 2013

Smoking reduce 10years lifespan,ధూమపానంతో 10ఏళ్ల జీవితం ఉఫ్‌


  •  

  •  
మెల్‌బోర్న్‌: ధూమపానం అనేది ఓ వ్యక్తి జీవితంలో కనీసం పదేళ్ల కాలాన్ని ఉఫ్‌మని వూదేస్తుంది. అంటే పదేళ్ల జీవిత కాలాన్ని కోల్పోయి మృత్యువు ఒడి చేరడం ఖాయం అని ఆస్ట్రేలియాలో తాజాగా నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. పొగతాగే అలవాటున్న వారు హఠాన్మరణం చెందుతారని తెలిపింది. పొగతాగే అలవాటున్న వారి వివరాలను...వారి ఆరోగ్య పరిస్థితులను నాలుగేళ్లపాటు నిరంతరాయంగా పరిశీలించి...విశ్లేషించిన మీదట తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. దాదాపు ఇరవైవేల మందికి చెందిన రికార్డులను పరిశీలించామన్నారు. ఈ అలవాటుకు బానిసలైన వారు ఏ వయసులో ఉన్నా సరే వెంటనే మానేస్తే...కచ్చితంగా ఏ విధమైన సమస్యలుండవనీ...ప్రాణభయం అసలే ఉండదనీ పరిశోధకులు తెలిపారు.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

exercise protects brain,మెదడుకు వ్యాయామ రక్ష

  •  

వాషింగ్టన్‌: వ్యాయామంతో శరీర దారుఢ్యమే కాదు.. మేధోశక్తి కూడా పెరుగుతుందని మీకు తెలుసా? డానా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులో ఉత్పత్తయ్యే ఎఫ్‌ఎన్‌డీసీ5 అనే అణువు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే జ్ఞాపకశక్తి, విషయగ్రహణలో పాలు పంచుకునే జన్యువులను ప్రేరేపించే ఐరిసిన్‌ ప్రోటీన్‌ స్థాయులు కూడా వ్యాయామం మూలంగా పెరుగుతున్నట్టు కనుగొన్నారు. నాడీ సంబంధ వ్యాధుల చికిత్సకు, వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరచేందుకు మందులను రూపొందించటంలో ఇవి ఉపయోగపడగలవని భావిస్తున్నారు. విషయగ్రహణ శక్తిని వ్యాయామం పెంపొందించగలదని.. పక్షవాతం, కుంగుబాటు, అల్జీమర్స్‌ వంటి జబ్బుల లక్షణాలను తగ్గించగలదని తేలినప్పటికీ ఇదెలా జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా తెలియదు. అయితే ఇందులో బీడీఎన్‌ఎఫ్‌ అనే వృద్ధి కారకం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. వ్యాయామం చేయటం వల్ల మెదడులో ఎఫ్‌ఎన్‌డీసీ5, ఐరిసిన్‌ ఉత్పత్తితో పాటు బీడీఎన్‌ఎఫ్‌ వృద్ధి కారకం వ్యక్తీకరణ కూడా పెరిగినట్టు తేలింది.--PM 06:59 12-10-2013
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

06 October 2013

Heart is healty with beer,బీరుతో గుండె హుషారు

  •  


  •  
లండన్‌: రోజుకో గ్లాసు(అరలీటరు) బీరు తాగితే చాలు.. గుండె చుట్టూ ఉండే రక్తనాళాల పరిస్థితి మెరుగవడంతో పాటు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, ధమనులు మరింత మృదువుగా మారతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. 400 మి.లీ. బీరు తాగిన తర్వాత రెండు గంటల్లో దమనులు మరింత మెత్తగా మారడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడినట్లు గుర్తించామని గ్రీస్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అదేసమయంలో ఆల్కహాల్‌ రహిత బీరు తాగితే ఈ ప్రభావమేమీ కనిపించలేదని 'ద సన్‌' పేర్కొంది. బీరులో ఉండే ఆల్కహాల్‌, యాంటీఆక్సిడెంట్ల సమ్మేళనం వల్లే తాజా ఫలితాలు వచ్చి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Book reading improve memory power,పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తి పదిలం



  •  
అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి -->
వాషింగ్టన్‌: పుస్తకాలు ఎక్కువగా చదవడం, రాయడం, బుర్రకు పనిపెట్టే పనుల్లో పాలుపంచుకోవడం వంటి చర్యల ద్వారా వృద్ధాప్యంలోనూ జ్ఞాపకశక్తిని పదిలపరచుకోవచ్చని అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. షికాగోలోని రష్‌ విశ్వవిద్యాలయ వైద్య కేంద్రానికి చెందిన పరిశోధకులు దీన్ని నిర్వహించారు. ''చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకూ ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల వార్ధక్యంలో మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది'' అని పరిశోధనకు నాయకత్వం వహించిన రాబర్ట్‌ ఎస్‌ విల్సన్‌ తెలిపారు. అధ్యయనంలో భాగంగా 294 మందికి జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Cure of AIDS with cancer medicines,కేన్సర్‌ మందుతో ఎయిడ్స్‌ మాయం

  •  

లండన్‌: కేన్సర్‌కు మందు ఇస్తే ఎయిడ్స్‌ నయమైన విచిత్ర ఘటన అమెరికాలోని బోస్టన్‌లో జరిగింది. ఎయిడ్స్‌ బారిన పడిన ఇద్దరు వ్యక్తులు (పురుషులు) చాలాకాలంగా ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిలో లింఫొమా అనే రకం రక్తకేన్సర్‌ కూడా బయటపడటంతో వైద్యులు.. మూలకణాల మార్పిడి చికిత్స జరిపారు. దీని తర్వాత కొన్నిరోజులకు చూస్తే కేన్సర్‌ నయమవటమే కాదు.. ఏయిడ్స్‌ బారి నుంచీ వారు విముక్తి పొందినట్లు తెలిసింది. వారిద్దరి రక్తంలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదు. ఒక వ్యాధిగ్రస్థుడికి 15 వారాల నుంచి ఎయిడ్స్‌ మందులు ఇవ్వటం మానివేయగా, మరొకరికి ఏడువారాల నుంచి నిలిపివేశారు. ఈ వివరాలను కౌలాలంపూర్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ ఏయిడ్స్‌ సొసైటీ సమావేశంలో.. బోస్టన్‌లోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, బ్రిగమ్‌ అండ్‌ విమెన్స్‌ హాస్పిటల్‌కు చెందిన తిమోతి హెన్రిచ్‌ వెల్లడించారు. బాధితుల నుంచి ఏయిడ్స్‌ వైరస్‌ పూర్తిగా తొలగిపోయిందా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు.(5:23 PM 06-Oct-13)
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

04 October 2013

New vaccine to reduce cholesterol,కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొత్త టీకా


  •  
లండన్‌: కొలెస్ట్రాల్‌ను సగందాకా తగ్గించి వేసే కొత్తరకం టీకాను అందుబాటులోకి రానుంది. ప్రాణాంతక కొలెస్ట్రాల్‌ను 57 శాతందాకా తగ్గించే ఈ టీకాను రోగులపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. స్టాటిన్‌ మందులతో నిరోధకత ఉండే రోగులకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. హానికారక కొలెస్ట్రాల్‌గా వ్యవహరించే 'లోడెన్సిటీ లిపోప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌)'ను లక్ష్యంగా చేసుకునే ఈ పద్ధతితో అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే రోగులకు కొత్త తరహా చికిత్స అందుబాటులోకి రానుందని పరిశోధకులు పేర్కొన్నారు. 'ఏఎల్‌ఎన్‌-పీసీఎస్‌'గా పిలిచే ఔషధం కొలెస్ట్రాల్‌ను నియంత్రించే 'పీసీఎస్‌కే9' అనే ప్రొటీన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. రక్తంలోని హానికారక కొలెస్ట్రాల్‌ను తొలగించే రిసెప్టర్లను ఈ ప్రొటీన్‌ దెబ్బతీస్తుంది. ఈ కొత్త విధానంతో చికిత్సపై ఆశలు చిగురిస్తున్నాయని బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ వైద్య సంచాలకులు ప్రొఫెసర్‌ పీటర్‌ వీస్‌బెర్గ్‌ పేర్కొన్నారు.(10:37 AM 04-Oct-13)
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New vaccine for T.B,టీబీకి కొత్త టీకా

  •  


టొరంటో: ప్రాణాంతక క్షయ వ్యాధితో పోరాడే కొత్త తరహా టీకాను కెనడా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సరికొత్త 'బూస్టర్‌' టీకాను జన్యుపరంగా తీర్చిదిద్దిన జలుబు వైరస్‌ ఆధారంగా తయారు చేశారు. కొత్త టీకా బీసీజీకి బూస్టర్‌గా పని చేస్తుంది. టీబీకి ఈ తరహా టీకాను తొలిసారిగా తాము రూపొందించినట్లు మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్‌ ఫియోనా స్మెయిల్‌ పేర్కొన్నారు.---04-Oct-13
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

withstand from stress with exercise,వ్యాయామంతో ఒత్తిడిని తట్టుకునే శక్తి

  •  



వాషింగ్టన్‌: వ్యాయామంతో మధుమేహం, అధిక రక్తపోటు ముప్పులను నివారించుకోవచ్చనేది తెలిసిందే. ఇది ఒత్తిడిని తట్టుకునేలా మెదడునూ పునర్‌ వ్యవస్థీకరిస్తున్నట్టు తాజాగా బయటపడింది. మెదడుపై శారీరక శ్రమ చూపే ప్రభావాన్ని తెలుసుకోవటానికి ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఎలుకలపై అధ్యయనం చేశారు. తరచుగా వ్యాయామం చేసిన ఎలుకల మెదడులో ఆందోళనను నియంత్రించే భాగంలో ఉత్సుకతను అణచివేసే నాడీకణాలు చురుకుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.(04/Oct/2013)
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

02 October 2013

Dementia is more due to stress in women,మహిళల్లో ఒత్తిడితో డిమెన్షియా




న్యూయార్క్‌: మహిళలు విడాకులు, భర్తను కోల్పోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం వంటి ఒత్తిడి కలిగించే పరిణామాలకు లోనైనప్పుడు.. తర్వాతి కాలంలో డిమెన్షియా బారిన పడతారని తాజా అధ్యయనంలో గుర్తించారు. స్వీడన్‌లో 800 మంది మహిళలపై చేపట్టిన అధ్యయనంలో.. మధ్యవయసులో ఈ తరహా ఒత్తిడికి గురైన వారిలో తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి మానసిక సమస్యలు పెరిగే ముప్పు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మానసికపరమైన ఒత్తిడికి లోనయ్యే వారిలో.. కుంగుబాటు, ఆందోళన, భయం, ఉద్రేకం, నిద్రసమస్యలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే.. వీటికి ఇతరత్రా కారణాలు కూడా తోడవ్వచ్చని చెబుతున్నారు. మానసిక ఒత్తిడికీ మెదడులో ఇన్‌ఫ్లమేటరీ కారకాల ఉత్పత్తి పెరిగేందుకు సంబంధం ఉంటుందని వివరించారు. గుండెజబ్బు ముప్పు కూడా పెరుగుతుందనీ, ఇవన్నీ కలిసి డిమెన్షియా ముప్పును పెంచుతాయని పేర్కొన్నారు.(5:55 AM 10/2/2013)

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Brain cells for treatment,వైద్యం చేసే మెదడు కణాలు.




టొరంటో: వైద్యం చేసే మెదడు కణాల్ని ప్రయోగశాల్లో పెంచే విధానానికి శాస్త్రవేత్తలు మరింత చేరువయ్యారు. ప్రయోగశాలల్లో వృద్ధిచేసే వీటిని రోగులకు మార్పిడి చేయడం ద్వారా ఎన్నో నాడీసంబంధ సమస్యలకు చికిత్స అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. సూక్ష్మ బయాప్సీ విధానం ద్వారా సేకరించిన మెదడు కణాలను భారీ సంఖ్యలో వ్యక్తిగత కణాలుగా ప్రయోగశాలలో పెంచుతారు. ఇవి ఆరోగ్యకరమే కాకుండా, నిల్వ ఉండి, భవిష్యత్తులో గాయాలు, విషప్రభావం, వ్యాధుల నుంచి మెదడును కాపాడే సాధనాలుగా ఉపయోగపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రయోగశాల నుంచి అవసరమైన వారికి మార్పిడి చేసే అవకాశం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన విజయంతో ప్రస్తుతం చికిత్స లేని నాడీసంబంధ మొండిజబ్బులకు సైతం భవిష్యత్తులో వ్యక్తిగత పరమైన, కణ ఆధార వైద్యం అందించే అవకాశాలు అందుబాటులోకి వస్తాయిని విశ్వసిస్తున్నట్లు వెస్టరన్‌ ఒంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకులు మాథ్యూ ఒ. హెబ్‌ పేర్కొన్నారు.(5:53 AM 10/2/2013)

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Tight waist belt may leads to Oesophgial cancer,బిగుతుగా బెల్ట్‌ పెట్టుకుంటే గొంతు క్యాన్సర్‌ ముప్పు




లండన్‌: నడుముకు అతి బిగుతుగా బెల్టు పెట్టుకునేవారికి గొంతు క్యాన్సర్‌ ముప్పు పొంచిఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ముఖ్యంగా వూబకాయులకు ఈ ప్రమాదం మరింత ఎక్కువని తెలిపింది. బరువు ఎక్కువగా ఉన్నవారు నడుముకు అతి బిగుతుగా బెల్టు ధరించడం వల్ల ఉదర ఆమ్లాలు వెనక్కివెళ్లి అన్నవాహికకు చేరుతాయని.. ఇది ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లాస్గో, స్ట్రత్‌క్త్లెడ్‌ వర్సిటీల పరిశోధకులు 24 మందిపై అధ్యయనం నిర్వహించి ఈ ఫలితాలు వెల్లడించారు. అధిక బరువుగల వారిలో ఉదర ఆమ్లాలు తిరిగి అన్నవాహికకు చేరినట్లు స్పష్టంగా గుర్తించారు. ''వూబకాయులు నడుముకు బిగుతుగా బెల్టు ధరించడం వల్ల ఉదరం, అన్నవాహికల మధ్య ఉన్న నాళంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఆమ్లాలు అన్నవాహికలోకి చేరుతాయి'' అని ముఖ్యఅధ్యయనకర్త కెన్నెత్‌ మెకోల్‌ తెలిపారు. ఉదరంలాగా ఆ ఆమ్లాలను అన్నవాహిక భరించలేదని.. ఈ పరిణామం గొంతు క్యాన్సర్‌కు దారితీస్తుందని వెల్లడించారు.(5:49 AM 10/2/2013)
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

New method for artificial fertilization,కృత్రిమ సంతానోత్పత్తిలో వినూత్న పద్ధతి


వాషింగ్టన్‌: సంతానం లేని మహిళల అండాశయంలో అండాలను ఉత్పత్తి చేసి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 'ఇన్‌విట్రో యాక్టివేషన్‌' (ఐవీఏ) అనే ఈ పద్ధతిని అమెరికా, జపాన్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధిపరిచారు. మహిళ అండాశయాన్నిగానీ, అండాశయంలోని కొంత భాగాన్నిగానీ తొలగించి అవసరమైన చికిత్సను అందజేసి తిరిగి మహిళ ఫాలోపియన్‌ ట్యూబుల వద్ద అమరుస్తారు. అనంతరం, కొన్ని హార్మోన్ల ద్వారా మహిళకు చికిత్స జరిపి.. అండాశయంలో అండాలు ఉత్పత్తి అయ్యేలా ప్రేరణ కలిగిస్తారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీసుకురాగలిగారు.(5:46 AM 10/2/2013)

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New eye test to detect blindness in advance,అంధత్వ ప్రమాదాన్ని గుర్తించే సరికొత్త కంటిపరీక్ష




మెల్‌బోర్న్‌: వయసుతో పాటు పెరిగే కంటిపాప క్షయం(ఏఎండీ-age related macular degeneration) జబ్బును ముందే గుర్తించేందుకు సులభమైన కంటి పరీక్ష విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వ్యాధి ప్రాథమిక దశలో చూపు ఉంటుంది కానీ, క్రమంగా కంటిలోని మిగతా భాగాలనూ ఇది దెబ్బతీసి అంధత్వానికి దారితీస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన దృష్టి కేంద్రం(వీసీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంటి పరీక్షలు దీన్ని ముందుగా గుర్తించలేవని, తాము అభివృద్ధి చేసిన కొత్త పరీక్షతో వైద్యులు ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అంధత్వాన్ని నివారించవచ్చని వీరు చెప్తున్నారు. వయసు పెరుగుతున్నకొద్దీ చాలామందికి రెటీనాలో పసుపు మచ్చలు ఏర్పడతాయని, డ్రసెన్‌గా పేర్కొనే దీనివల్ల ఏఎండీ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు దృష్టికేంద్రం, ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ టెడ్‌ మేడెస్‌. ఏఎండీ ప్రాథమిక దశలో ఉన్నవారు ఎల్‌సీడీ తెరలపై దృశ్యాలను చూస్తున్నప్పుడు వారి కంటిపాపలు ఎలా స్పందిస్తున్నాయనేది వీరు రూపొందించిన నిజక్షేత్ర విశ్లేషణ పరికరంతో గుర్తించారు. ప్రస్తుతమున్న పరికరాలు కంటి ప్రధాన దృష్టి క్షేత్రాన్నే పరీక్షిస్తాయని, తాము రూపొందించిన విధానంలో మొత్తం దృష్టి తీరును పరీక్షించొచ్చని మేడిసన్‌ చెప్తున్నారు. ఏఎండీతో బాధపడే అందరూ పూర్తిగా దృష్టి కోల్పోతారని కచ్చితంగా చెప్పలేకపోయినా, ఒకవేళ అలాంటి ప్రమాదముంటే ముందుగానే గుర్తించవచ్చన్నది వీరి పరిశోధనల సారాంశం. ఈ అధ్యయన వివరాలను 'గ్రేఫ్స్‌ ఆర్కైవ్‌ ఫర్‌ క్లినికల్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఆప్తాల్మజీ' జర్నల్‌ ప్రచురించింది.(5:46 AM 10/2/2013)
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Niacin or nicotinamide keep good health,విటమిన్‌-బీ3తో సుదీర్ఘ ఆరోగ్యకర జీవనం




లండన్‌: సుదీర్ఘ, ఆరోగ్యకర జీవితం వెనక విటమిన్‌-బీ3 (నియాసిన్‌) కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. శరీరం వ్యాయామం చేస్తున్నట్లు నియాసిన్‌ భ్రమింప చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈటీహెచ్‌ జ్యూరిచ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఏలికపాములపై నియాసిన్‌తో ప్రయోగం చేసి చూడగా.. ఈ ఆహారం వల్ల ఏలికపాము సాధారణంకన్నా ఎక్కువ కాలం జీవించినట్లు తేలింది. నియాసిన్‌ వ్యాయామం తరహా జీవక్రియ పరిస్థితిని కలిగిస్తుందనీ, శరీరం వ్యాయామం చేస్తున్నట్లుగా భ్రమింపజేస్తుందని పరిశోధకులు రిస్టో చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలు మనుషులకూ వర్తిస్తాయని పేర్కొన్నారు. నియాసిన్‌ నికొటినమైడ్‌గా మారడం వల్లే ఈ ప్రయోజనాలు దక్కుతున్నట్లు వివరించారు. నియాసిన్‌ను ఆహార సప్లిమెంట్లుగా తీసుకోవడం ఎప్పట్నుంచో ఆమోదంలో ఉన్నదేనని వివరించారు.(5:46 AM 10/2/2013)

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/