28 January 2014

Low blood glucose improve and increase memory,గ్లూకోజ్‌ తగ్గితే పెరిగే జ్ఞాపకశక్తి

  •  
  •  

బెర్లిన్‌: రక్తంలో గ్లూకోజ్‌ తక్కువగా ఉండేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. మధుమేహం లేకపోయినా రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా.. సగటున 63 ఏళ్ల వయసులో ఉన్న 141 మంది జ్ఞాపకశక్తి నైపుణ్యాలను, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను పరిశీలించారు. జ్ఞాపకశక్తి విషయంలో కీలకంగా వ్యవహరించే మెదడులోని హిపోక్యాంపస్‌ పరిమాణాన్ని తెలుసుకునేందుకు స్కానింగ్‌ చేశారు. రక్తంలో తక్కువ గ్లూకోజ్‌ ఉన్నవారు జ్ఞాపకశక్తి పరీక్షలో మంచి నైపుణ్యం ప్రదర్శించినట్లు తేలింది. అధిక గ్లూకోజ్‌ ఉండేవారు తక్కువ పదాలను జ్ఞాపకం ఉంచుకున్నట్లు గుర్తించారు. రక్తంలో గ్లూకోజ్‌ సాధారణ స్థితిలో ఉన్నవారూ, చక్కెర స్థాయిని తగ్గించుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యల్ని తగ్గించుకోవచ్చనీ, వయసు పెరుగుతున్న కొద్దీ కాగ్నిటివ్‌ సామర్థ్యం తగ్గడాన్ని నివారించుకోవచ్చని బెర్లిన్‌లోని వైద్య విశ్వవిద్యాలయ పరిశోధకులు యాగ్నెస్‌ ఫ్లోయెల్‌ పేర్కొన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Pain intensity is more in females,నొప్పి తీవ్రత స్త్రీలలోనే అధికం



తాజా అధ్యయనంలో వెల్లడి--మెల్‌బోర్న్‌: నొప్పుల చికిత్స విషయంలో స్త్రీ...పురుషులకు విడివిడిగా మందులు ఉండాలనీ...చికిత్సా విధానాలు సైతం వేర్వేరుగా ఉండటం తప్పనిసరని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, నొప్పుల తీవ్రత...ప్రభావం విషయంలో స్త్రీ...పురుషుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం గోచరించినట్లు వారు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పులతో బాధపడే మహిళలకు సంక్లిష్ట చికిత్స అవసరం పడుతుంది. వారితో పోలిస్తే పురుషులకు కాస్త సులువైన చికిత్సతో పరిస్థితి మెరుగు పడుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నొప్పుల చికిత్స విషయంలో స్త్రీ...పురుష బేధం తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. ప్రాధమికంగా నొప్పుల తీవ్రత...బాధ మహిళల్లో విపరీతంగా ఉంటుంది. ఇందుకు కారణం 'గ్లియల్‌ కణాల'(మెదడులోని రోగనిరోధక కణాలు) పనితీరు స్త్రీ...పురుషుల్లో వేర్వేరుగా ఉండటమేనని పరిశోధకులు విశ్లేషించారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Test to detect pancreas cancer,పాంక్రియాస్‌ క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష

  •  
  •  
వాషింగ్టన్‌: పాంక్రియాస్‌ క్యాన్సర్‌ తొలి లక్షణాలను గుర్తించేందుకు జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేలికైన రక్తపరీక్షను రూపొందించారు. వీరిలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. పాంక్రియాస్‌ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందువల్ల ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కొత్తగా రూపొందించిన ఈ రక్తపరీక్ష.. బీఎన్‌సీ1, ఏడీఏఎమటీఎస్‌1 జన్యువుల పైభాగంలో తలెత్తే మార్పుల ఆధారంగా క్యాన్సర్‌ను పసిగడుతుంది. దీంతో తొలిదశలోనే పాంక్రియాస్‌ క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స చేయటానికి వీలవుతుందని పరిశోధకుల్లో ఒకరైన నీతా అహుజా తెలిపారు.
source : eenadu news paper 25-Oct.-2013
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Recognition of Alzheimer's disease Bioindicators,అల్జీమర్స్‌ జీవసూచికల గుర్తింపు

  •  

  • అల్జీమర్స్‌ జీవసూచికల గుర్తింపు
లండన్‌: వెన్నుపాము ద్రవంలో ఉండే ఆరు ప్రోటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి తొలిదశ అల్జీమర్స్‌ను గుర్తించటానికి జీవసూచికలుగా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. మన మెదడులో బీటా అమిలాయిడ్‌ ప్రోటీన్‌తో కూడిన గార పోగుపడటం మూలంగా అల్జీమర్స్‌ వస్తుంది. సాధారణంగా లైసోసమ్స్‌ అనేవి ఈ ప్రోటీన్‌ పోగపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. కానీ అల్జీమర్స్‌ బాధితుల్లో ఈ లైసోసోమ్స్‌ పని చేయవని లింకోపింగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కటరినా కగెడల్‌ తెలిపారు. ఈ మార్పులు వెన్నుపాము ద్రవంలో కనిపించొచ్చనే అనుమానంతో పరిశోధకులు అధ్యయనం చేయగా.. ఆరు ప్రోటీన్లకు లైసోసమ్‌ వ్యవస్థతో స్పష్టంగా సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

17 January 2014

Brain cleaned during sleep ,మంచినిద్రతో మెదడు పరిశుభ్రం

  •  
  •  Brain cleaned during sleep ,మంచినిద్రతో మెదడు పరిశుభ్రం

వాషింగ్టన్‌: మంచి నిద్ర మెదడును పరిశుభ్రపరిచేస్తుంది అని న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. బాగా నిద్రపోయే సమయంలో మెదడు కణాల మధ్య దూరం పెరుగుతుంది... తద్వారా కలుషితాలన్నీ కూడా కొట్టుకుపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నిద్రపోయేటప్పుడు మెదడులో 'లింఫాటిక్‌ సిస్టమ్‌' అనేది చురుగ్గా పనిచేయడంతో మెదడు పరిశుభ్రమౌతుందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

source : Eeandu news paper 19-10-2013
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Cancer causing gene detection,క్యాన్సర్‌ కారక జన్యువుల గుర్తింపు

  •  
  •  
 Cancer causing gene detection,క్యాన్సర్‌ కారక జన్యువుల గుర్తింపు

వాషింగ్టన్‌: క్యాన్సర్ల వృద్ధికి తోడ్పడుతున్న 127 జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త నిర్ధరణ పరికరాలను తయారుచేయటానికి, వ్యక్తులకు అనుగుణంగా చికిత్సలను రూపొందించటానికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లలో తరచుగా మార్పు చెందే జన్యువులు ఇతర రకాల కణితుల్లోనూ కనిపిస్తున్నట్టు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ''ఇది ఆరంభం మాత్రమే. మనుషుల్లో వచ్చే అన్నిరకాల క్యాన్సర్లకు కారణమయ్యే జన్యువుల జాబితాను రూపొందించే అవకాశంపై శాస్త్రవేత్తలు, క్యాన్సర్‌ నిపుణులు ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి మనం చేరువ అవుతున్నామనే అనుకుంటున్నా'' అని అధ్యయన నేత లి డింగ్‌ వ్యాఖ్యానించారు.

source : Eenadu news paper 19-10-2013

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

15 January 2014

Alzimers Test in 15 minutes,15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష

  •  
  •  

-15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష-
వాషింగ్టన్‌: అల్జీమర్స్‌ ప్రాథమిక లక్షణాలను 15 నిమిషాల్లో గుర్తించే పరీక్షావిధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరీక్షను ఇంటి వద్దే చేసుకోవచ్చని పేర్కొన్నారు. 'ఎస్‌ఏజీఈ-సేజ్‌ టెస్ట్‌'.. సొంతంగా ఎవరికివారే చేసుకోవచ్చని, లక్షణాల ఆధారంగా వైద్యులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఓహియో స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Memory power in the in dental cleaness,తళతళ జ్ఞాపకశక్తికి దంతాల చిగుళ్ల శుభ్రత

  •  
  •  


చిరునవ్వుకు తెల్లగా మెరిసే దంతాలు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి కదా. అంతేకాదు. ఇవి జ్ఞాపకశక్తిని కాపాడటానికీ తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. దంతాల, చిగుళ్ల శుభ్రతకూ అల్జీమర్స్‌ జబ్బుకూ సంబంధం ఉంటోందని తేలటమే దీనికి నిదర్శనం. తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) బారినపడ్డవారు చనిపోయిన తర్వాత వారి మెదడు కణజాలంపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. డిమెన్షియా బాధితుల మెదళ్లలో పి.జింజివలిస్‌ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్టు ఇందులో తేలటం గమనార్హం. తీవ్ర చిగుళ్లవాపు జబ్బుకు దోహదం చేసే పి.జింజివలిస్‌ బ్యాక్టీరియా.. మనం భోజనం చేసినప్పుడో, పళ్లు తోముకుంటున్నప్పుడో రక్త ప్రవాహంలో కలుస్తుంది. అక్కడ్నుంచి అది మెదడుకు చేరుకుంటున్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మెదడుకు చేరుకున్న ప్రతీసారీ అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని భావిస్తున్నారు. దీంతో మెదడు కణాల నుంచి విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా మీదనే కాదు.. నాడీ కణాలు మీదా దాడిచేసి వాటిని దెబ్బతీస్తాయన్నమాట. ఇది చివరికి డిమెన్షియాకు దారితీస్తుంది.

   
 source : Medical Trends and updates magazine
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

14 January 2014

Uterus transplantation,గర్భాశయం మార్పిడి




9 మంది గర్భసంచి మార్పిడి
స్టాక్‌హోం: స్వీడన్‌ వైద్యులు.. 9 మంది మహిళలకు గర్భాశయాన్ని అమర్చారు. బంధువుల నుంచి సేకరించి, వీరి శరీరంలోకి ప్రవేశపెట్టారు. గర్భం దాల్చేందుకు కూడా వారు ప్రయత్నిస్తారని ప్రాజెక్టులో పాలుపంచుకున్న వైద్యులు తెలిపారు. మహిళల్లో గర్భాశయ మార్పిడి సాధ్యమేనా అన్నది పరిశీలించేందుకు దీన్ని చేపట్టారు. ఈ మహిళలు గర్భాశయం లేకుండా జన్మించడమో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కారణంగా వాటిని తొలగించడమో జరిగింది. వీరంతా 30లలో ఉన్నారు. ప్రాణాధారమైన గుండె, కాలేయం, మూత్రపిండాల మార్పిడిని వైద్యులు కొన్ని దశాబ్దాలుగా చేపడుతున్నారు. ఇప్పుడు రోగి చేతులు, ముఖం, ఇతర భాగాల మార్పిడి కూడా జరుగుతోంది. గర్భాశయ మార్పిడి మాత్రం విజయవంతం కాలేదు. లోగడ టర్కీ, సౌదీ అరేబియాల్లో ప్రయోగాలు జరిగాయి. అయితే ప్రయోగార్థులకు సంతానప్రాప్తి కలగలేదు. బ్రిటన్‌, హంగేరి, అమెరికాల్లో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి కన్నా అత్యాధునిక పద్ధతిలో స్వీడన్‌ పరిశోధకులు ఆపరేషన్‌ చేపట్టారు. గోథెన్‌బర్గ్‌ వర్సిటీకిచెందిన మాట్స్‌ బ్రాన్‌స్ట్రామ్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం దీన్ని నిర్వహించింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

03 January 2014

TV effect on Sperm,వీర్యంపై టీవీ ప్రభావం

  •  
  •  

శారీరక శ్రమ లేకపోవటం, చాలాసేపు టీవీ చూడటం వల్ల వీర్యం చిక్కదనం, వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌కు చెందిన ఆడ్రే గాస్కిన్స్‌ చాలాకాలంగా వీర్యంపై ఆహారం, వ్యాయామం చూపే ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. శారీరక శ్రమ మూలంగా ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ (విశృంఖల కణాలను తొలగించుకునే సమయంలో శరీరంపై పడే ఒత్తిడి) తగ్గుతున్నట్టు.. ఇది వీర్య కణాల రక్షణకు తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా ఆమె యువకులపై తాజాగా అధ్యయనం చేశారు. వారానికి 15 గంటల పాటు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామం చేసినవారిలో వీర్యం చిక్కదనం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అలాగే టీవీ చూడని వారితో పోలిస్తే వారానికి 20 గంటల పాటు టీవీ ముందు గడిపే యువకుల్లో వీర్యకణాల సంఖ్య సుమారు సగం వరకు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వీర్యకణాల చురుకుదనం, వాటి ఆకారం విషయంలో మాత్రం మార్పులేవీ కనబడలేదని వివరిస్తున్నారు. కేవలం ఈ ఫలితాల ఆధారంగా వ్యాయామంతో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఇతరత్రా లాభాలు చాలా ఉంటాయి కాబట్టి వేగంగా నడవటం, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటివి చేయటం మంచిదని సూచిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/