19 March 2014

Anaemia with Proton pump inhibitor ,ఛాతీమంట మందులతో రక్తహీనత


  •  
 

  •   
ఛాతీలో మంటను తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడితే విటమిన్‌ బి12 లోపం ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే రక్తహీనతకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. నాడులు దెబ్బతినటం, మతిమరుపు సైతం రావొచ్చని చెబుతున్నారు. ఛాతీ మంటను తగ్గించే ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (ఒమిప్రెజోల్‌ వంటివి) మందులను రెండు సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువకాలం వాడినవారికి విటమిన్‌ బి12 లోపం 65% ఎక్కువగా ఉంటున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రోజుకి ఒకటిన్నర మాత్రలు వేసుకునేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక హిస్టమిన్‌ 2 రిసెప్టర్‌ యాంటగోనిస్ట్స్‌ (సిమెటిడిన్‌, రాంటిడిన్‌ వంటివి) మందులు వాడేవారికి బి12 లోపం ముప్పు 25% అధికమవుతున్నట్టు తేలింది. అందువల్ల ఈ మందులను తప్పకుండా వేసుకోవాల్సినవారికి తక్కువ మోతాదులో ఇవ్వటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో విటమిన్‌ బి12 లోపంతో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి ఎగదన్నుకొని, అన్నవాహికలోకి రావటం వల్ల ఛాతీ మంట వస్తుంది. మసాలాలు, కారం, తదితర ఆహార పదార్థాలు.. మద్యం, కొన్నిరకాల మందులు, గర్భం ధరించటం వంటివి ఈ సమస్యను తెచ్చిపెట్టొచ్చు.



  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Diseases in children with tension,ఒత్తిడితో పిల్లలకు జబ్బులు

  •  
  •  

ఒత్తిడి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది పెద్దల్లోనే కాదు.. పిల్లలపైనా గణనీయమైన ప్రభావం చూపుతుంది. చిన్నప్పుడు ఒత్తిడితో బాధపడే పిల్లలకు పెద్దయ్యాక వూబకాయం, ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగానూ.. వూహిస్తున్నదానికన్నా ఇంకా ముందుగానే కనబడుతున్నట్టూ తాజాగా బయటపడింది. వేధింపులకు, హింసకు గురికావటం.. తల్లిదండ్రులు విడిపోవటం.. ఆర్థిక సమస్యల వంటి అనుభవాలను ఎదుర్కొన్న పిల్లలు గ్రహణలోపం, మానసిక, శారీరక, సమస్యల వంటి ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరిలో ఈ మూడు సమస్యలు కలిసి ఉండటమూ గమనార్హం. ఇవన్నీ దీర్ఘకాల ఒత్తిడి ప్రభావంతో తలెత్తుతున్నవేనని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల ఒత్తిడి మనసుకూ శరీరానికీ హాని కలిగిస్తుందని, ఇది నాడీసంబంధ హార్మోన్ల వ్యవస్థలోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తోందని వివరిస్తున్నారు. దీంతో జబ్బుల బారినపడే ముప్పూ పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఇది కొత్త విషయాలు నేర్చుకోవటానికి, ఇబ్బందులను అధిగమించటానికి పిల్లలకు తోడ్పడుతుంది కూడా. కానీ ఒత్తిడి తీవ్రమైతే, దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం లోపిస్తే మాత్రం దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీర్ఘకాల ఒత్తిడి మూలంగా బాల్యంలో మెదడు అభివృద్ధి అస్తవ్యస్తమవుతుంది. నాడీ, రోగనిరోధక వ్యవస్థలు మందగిస్తాయి. అంతేనా? పెద్దయ్యాక మద్యపానానికి అలవాటు పడటం, కుంగుబాటు, తిండి సమస్యలు, గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల పిల్లలకు ఒత్తిడికి గురవుతున్నట్టు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు.
  • ==========================
Visit my website at -> Dr.Seshagirirao.com/

14 March 2014

Bowel and Rectal Cancer with Obesity, వూబకాయం వలన పెద్దపేగు క్యాన్సర్

  •  
  •  
క్యాన్సర్లన్నింటిలోకీ పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లను తేలికగా నివారించుకునే అవకాశముంది. ఇవి ముందుగా క్యాన్సర్‌ రహిత బుడిపెల (పాలిప్స్‌) రూపంలోనే మొదలవుతాయి. చివరికి క్యాన్సర్‌గా మారతాయి. ఇందుకు దాదాపు పదేళ్ల సమయం పడుతుంది. అందువల్ల 50 ఏళ్లు పైబడిన తర్వాత తరచుగా కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఒకవేళ బుడిపెలు కనబడితే వాటిని తొలగించటం ద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు. వూబకాయులకు.. ముఖ్యంగా పురుషులకు కొలనోస్కోపీ పరీక్ష తప్పనిసరని మిషిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం సూచిస్తోంది. ఎందుకంటే కొవ్వు హార్మోన్‌ అయిన లెప్టిన్‌ స్థాయులు, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి, నడుము చుట్టుకొలత అధికంగా గల మగవారికి పెద్దపేగులో బుడిపెలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు బయపడింది మరి. ఫలితంగా వీరికి పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లు వచ్చే ముప్పూ ఎక్కువే ఉంటోంది.

ప్రస్తుతం కొలనోస్కోపీ పరీక్ష చేసే విషయంలో వయసు, కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనికి అధిక బరువునూ జోడించాల్సిన అవసరముందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరు వూబకాయులకు కొలనోస్కోపీ పరీక్ష చేయగా.. 30% మందిలో ఒకటి కన్నా ఎక్కువ బుడిపెలు ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. మరి కాస్త ఎక్కువ వూబకాయులకైతే మూడు బుడిపెలుండే అవకాశం 6.5 రెట్లు ఎక్కువగా ఉంటోందనీ వివరిస్తున్నారు. లెప్టిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం మూలంగా పెద్దపేగులోని క్యాన్సర్‌ ముందస్తుదశ కణాలకు రక్తసరఫరా పెరిగి, అవి వృద్ధి చెందటానికి దోహదం చేస్తోందని పేర్కొంటున్నారు. వూబకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

11 March 2014

New blood test detection of Alzimer disease ,అల్జీమర్స్‌ను అంచనా వేసే కొత్త రక్తపరీక్ష

  •  
  •  
ఆరోగ్యకరమైన వ్యక్తిలో రాబోయే మూడేళ్లలో స్వల్పస్థాయిలో మెదడుపరమైన క్షీణతగానీ, అల్జీమర్స్‌ వ్యాధిగానీ తలెత్తే అవకాశాన్ని అంచనా వేసే సాధారణ రక్తపరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రక్తపరీక్ష 10 రకాల కొవ్వులను గుర్తించి, విశ్లేషించడం ద్వారా అల్జీమర్స్‌ వచ్చే అవకాశాల్ని అంచనా వేస్తుంది. రెండేళ్లలో ఈ పరీక్ష అందరూ ఉపయోగించుకునే స్థాయిలో అందుబాటులోకి వస్తుందని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ హోవార్డ్‌ ఫెడెరాఫ్‌ పేర్కొన్నారు. ముందస్తుగానే వ్యాధిని గుర్తించడం వల్ల సరైన సమయంలో దానిని ఎదుర్కొనే అవకాశం కలుగుతుందన్నారు. తమ అధ్యయనంలో భాగంగా.. ఐదేళ్లపాటు 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరిశోధన చేపట్టినట్లు వివరించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Cancer is less in mothers of more children,ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్‌ దూరం

  •  
  •  

పది మంది లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్‌ వచ్చే ప్రమాదం చాలాతక్కువని ఫిన్లండ్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధనలో భాగంగా.. ఫిన్లండ్‌కు చెందిన 5,000 మంది మహిళలపై వీరు అధ్యయనం నిర్వహించారు. ఈ మహిళలందరూ 2010కన్నా ముందు కనీసం పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన వాళ్లే. వీరంతా లూథరిన్‌ చర్చికి చెందిన లీస్టడియన్‌ వర్గ సభ్యులు. వీరి దైనందినజీవితం సాధారణ మహిళల్లాగే ఉన్నప్పటికీ.. గర్భనిరోధక సాధనాలను ఉపయోగించటం వీరి మతంలో నిషిద్ధం. ఈ నేపథ్యంలోనే, వీరిలో పదిమంది సంతానాన్ని కలిగి ఉండటం సాధారణ విషయం. ఈ మతానికి చెందిన ఐదువేలమందిపై శాస్త్రవేత్తలు సర్వే జరిపినప్పుడు.. మూడుదశాబ్దాల వ్యవధిలో 656 మంది కేన్సర్‌ వ్యాధిని ఎదుర్కొన్నట్లు తేలింది. ఫిన్లండ్‌లో కేన్సర్‌ బాధిత స్త్రీలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా చూస్తే.. 5,000 మందిలో సగటున 856 మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. అంటే, పదిమందికన్నా ఎక్కువమంది పిల్లలున్న తల్లుల విషయంలో ఈ సంఖ్య 200 తక్కువగా ఉందని తేలింది. అదే విధంగా కేన్సర్‌ వ్యాధిని కొత్తగా ఎదుర్కొంటున్న వాళ్లు కూడా ఈ మహిళల్లో తక్కువేనని, సాధారణం కంటే వీరి సంఖ్య 24 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. చిన్నవయసులో తల్లి కావటం వల్ల రొమ్ముకేన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఇంతకుముందే పలు పరిశోధనల్లో రుజువైంది. కానీ, ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కూడా కేన్సర్‌ దూరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/