19 November 2014

Less sleep leads to more obesity,నిద్రలేమి బరువు ముప్పు

  •  


Less sleep leads to more obesity,నిద్రలేమి బరువు ముప్పు

ఎదిగే వయసులో తగినంత నిద్ర తప్పనిసరి. లేకపోతే ఇది చదువుల పైనా ప్రభావం చూపుతుంది. ఇది మున్ముందు వూబకాయం బారిన పడకుండా కూడా కాపాడుతున్నట్టు తాజాగా బయటపడింది. రాత్రిపూట తగినంత సేపు నిద్రపోని యుక్తవయసు పిల్లలకు వూబకాయం ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. ఇటీవల పరిశోధకులు సుమారు 10వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. 16 ఏళ్ల వయసులో ఉండగా వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయినట్టు గుర్తించారు. రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయినవారితో పోలిస్తే.. వీరికి వూబకాయం ముప్పు 20% ఎక్కువగా ఉంటున్నట్లు, అదీ 21 ఏళ్లు వచ్చేసరికే దీని ప్రభావం కనబడుతున్నట్టు తేలింది. ''యుక్తవయసులో తగినంత నిద్రపోకపోతే మున్ముందు వూబకాయం బారినపడే అవకాశముంది. ఒకసారిబకాయులైతే ఆ తర్వాత బరువు తగ్గించుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుంది'' అని అధ్యయన నేత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన షకీరా సుగిలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలు రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కవసేపు నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చదువులో రాణించటానికే కాదు. పెద్దయ్యాక ఆరోగ్యవంతులుగా ఉండటానికీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు రాత్రిపూట దాదాపు 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో సతమతమయ్యేవారు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార అలవాట్లు బరువు పెరగటానికి దోహదం చేసేవే కావటం గమనార్హం.

బకాయులైతే ఆ తర్వాత బరువు తగ్గించుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుంది'' అని అధ్యయన నేత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన షకీరా సుగిలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలు రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కవసేపు నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చదువులో రాణించటానికే కాదు. పెద్దయ్యాక ఆరోగ్యవంతులుగా ఉండటానికీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు రాత్రిపూట దాదాపు 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో సతమతమయ్యేవారు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార అలవాట్లు బరువు పెరగటానికి దోహదం చేసేవే కావటం గమనార్హం.

వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

  •  

  • వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

గర్భధారణకు ప్రయత్నిస్తున్నారా? అయితే వేపుళ్లను తినకుండా చూసుకోండి. ఇలాంటి తిండితో గర్భిణి మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) ముప్పు పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణకు ముందు అధికంగా తిన్న మహిళలకు గర్భిణి మధుమేహం ముప్పు 13 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది మరి. వారానికి 4-6 సార్లు వేపుళ్లను తినేవారికి ఈ ముప్పు 31% అధికంగా ఉంటుండగా.. 7, అంతకన్నా ఎక్కువసార్లు తినేవారికైతే రెండింతలు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని (బాడీమాస్‌ ఇండెక్స్‌) పరిగణనలోకి తీసుకొని చూసినా వేపుళ్లను తినేవారికి గర్భిణి మధుమేహం వచ్చే అవకాశం అధికంగానే ఉంటోందని.. ఇలాంటి ఆహారాన్ని ఇంట్లో వండుకొని తినేవారి కన్నా హోటళ్లలో తినేవారికి ముప్పు మరింత పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. వేపుళ్లు తినటాన్ని అదుపు చేస్తే జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ముప్పు తగ్గటానికి తోడ్పడగలదని సూచిస్తున్నారు. కాబట్టి వేపుళ్ల విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండటం మంచిది.

Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

  •  

  • Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది పిల్లల్లో ఎక్కువ. ఒళ్లంతా ఎర్రటి దద్దు, దురదతో బాధపెట్టే ఈ సమస్య చలికాలంలో మరింత ఉద్ధృతం అవుతుంటుంది కూడా. ఇలాంటి పిల్లలకు విటమిన్‌ డి మేలు చేస్తున్నట్టు, ఎగ్జిమా లక్షణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు తాజాగా బయట పడింది. సాధారణంగా అటోపిక్‌ డెర్మటైటిస్‌కు అల్ట్రావయొలెట్‌ (యూవీ) కాంతి చికిత్స కూడా చేస్తుంటారు. ఇది చర్మంలో విటమిన్‌ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చలికాలంలో ఎగ్జిమా ఉద్ధృతం కావటానికీ విటమిన్‌ డి లోపానికీ సంబంధం ఉండొచ్చనే అనుమానంతో పరిశోధకులు ఇటీవల మంగోలియాలో ఒక అధ్యయనం చేశారు. ఆ దేశంలో పిల్లల్లో విటమిన్‌ డి లోపం అధికం. కాబట్టి అటోపిక్‌ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న 2-17 ఏళ్ల పిల్లలను ఎంచుకొని.. వీరిలో కొందరికి రోజుకి 1,000 ఐయూ మోతాదులో విటమిన్‌ డి మాత్రలను, మరికొందరికి ఎలాంటి మందులేని మాత్రలను (ప్లాసిబో) ఇచ్చారు. నెల తర్వాత పరిశీలించగా.. విటమిన్‌ డి మాత్రలను వేసుకున్నవారిలో 29% మందిలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు మెరుగుపడినట్టు తేలింది. అందువల్ల పిల్లల్లో చలికాలంలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు తీవ్రమవుతుంటే కొన్ని వారాల పాటు విటమిన్‌ డి మాత్రలను ఇచ్చి చూసి, ఫలితాలు బాగుంటే మరికొంత కాలం కొనసాగించటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.

16 November 2014

Running is better than walking?, నడవడం కంటే పరుగు మంచి వ్యాయామమా?

  •  

  •  
Running is better than walking?, నడవడం కంటే పరుగు మంచి వ్యాయామమా?

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదని తెలిసిందే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకున్నారు. అయితే దైనందిన వ్యాయామంతోపాటు వారానికి ఐదురోజులపాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వూబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్‌... వంటి వాటిని నియంత్రించవచ్చంటున్నారు.
* పరుగువల్ల ఎండొకెనాబినాయిడ్లు అనే హార్మోన్లు విడుదలవడంతో ఆనందం లభిస్తుందని పరిశోధనలో తేలింది.
* పరిగెత్తితే మోకాళ్ల పనితీరు మరింత మెరుగవుతుంది. ఉదాహరణకు పరుగు ఆపాక కూడా చాలామంది అథ్లెట్లను పరిశీలిస్తే వాళ్లలో ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ రావడం తక్కువని తేలింది.
* రోజూ ఐదు నిమిషాలు పరిగెత్తడంవల్ల జీవితకాలం కనీసం ఓ ఐదేళ్లు పెరుగుతుందన్నది మరో కొత్త పరిశోధన. తెలిసిందిగా మరి... పరిగెత్తండి!

Bacteria is cause for Obesity?,వూబకాయం కు బ్యాక్టీరియానే కారణమం?

  •  


Bacteria is cause for Obesity?,వూబకాయం కు బ్యాక్టీరియానే కారణమం?

తగిన వ్యాయామం లేకపోవడం, అతిగా తినడం... వల్ల బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు అసలేం తినకున్నా కొంచెం తిన్నా వూబకాయంతో బాధపడుతుంటారు. అందుకే దీనిగురించి నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు నిపుణులు. ఇటీవల లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌కి చెందిన 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్విన్‌ రిసెర్చ్‌' చేసిన ఓ పరిశోధనలో ఓ కొత్తవిషయం తెలిసింది. తక్కువ బరువున్నవారి పొట్టలో క్రిస్టెన్‌సెనెల్లేసే కుటుంబానికి చెందిన ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువ బరువున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి ఈ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ ఉంటే వాళ్లు అంత సన్నగా ఉంటారని తేలింది. అయితే బ్యాక్టీరియా ఎక్కువ ఉండటం, తక్కువ ఉండటం అనేది మాత్రం జన్యుప్రభావమే. అంటే అది వంశపారంపర్యంగానే సంక్రమిస్తుంది. అయినప్పటికీ ఈ బ్యాక్టీరియాను కొన్ని ఎలుకల పొట్టలోకి ఇంజెక్ట్‌ చేయగా అవి సన్నబడ్డాయట. దాంతో ఈ పరిశో ధన ఆధారంగా వూబకాయాన్ని నిరోధించే కొత్త చికిత్సావిధానాలమీద దృష్టిపెట్టబోతున్నారు పరిశోధకులు.

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

creation of biological heart, జీవగుండె సృష్టి


 

    మార్పిడి చేయటానికి వీలయ్యే గుండెను జీవసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ప్రక్రియను పరిశోధకులు ఆవిష్కరించారు. గ్రహీత మూలకణాల్ని ఉపయోగించే గుండెను తయారు చేసే ఈ పరిశోధన కీలకమైన పరీక్షా దశలన్నింటినీ అధిగమించింది.

'హోల్‌ ఆర్గాన్‌ డీసెల్యులరైజేషన్‌'గా పిలిచే సరికొత్త ప్రక్రియలో గుండె కణజాలాన్ని రూపొందించినట్లు మినెసోటా యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పరిశోధకులు ఎలుక, పంది గుండెలోని కణాలన్నింటినీ పలురకాల రసాయనాల్ని ఉపయోగించి తొలగించారు. చివరికి జిగిబిగి అల్లికలాగా వాటిలోని రక్తనాళాలు మాత్రమే మిగిలాయి. ఆ నాళాల మీదకు మూలకణాల్ని ఇంజెక్ట్‌ చేశారు. వాటికి అవసరమైన పోషకాల్ని కూడా అందజేసి కొత్త అవయవం ఎదిగేలా చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ గుండె పంపింగ్‌ చేసే సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఇందులోని ప్రాథమిక పరిజ్ఞానం కొత్తదేమీ కాదు. గుండె కవాటాల్ని తయారుచేసే ప్రక్రియలో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కాకపోతే.. గుండెతో పోలిస్తే ఈ కవాటాలు చాలా చిన్నవిగా ఉంటాయి. తాము మానవ గుండె పరిమాణంతో సమంగా ఉండే పంది గుండెను ఎంచుకుని ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు పరిశోధకులు డాక్టర్‌ డారిస్‌ టేలర్‌ పేర్కొన్నారు. తర్వాతి దశలో మానవ గుండెనే ఇలా పునర్నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అవయవంలోని కణాల్ని తొలగించే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు, అవయవం ఎదగటానికి ఉపయోగించే పోషకాల విషయంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం గుండెనే ఈ ప్రక్రియలో నిర్మించి, గుండె మార్పిడి చికిత్స చేయాలనేది తమ లక్ష్యమని, ఈ తరహాలో తయారు చేసిన గుండె జీవనకాలం కూడా ఎక్కువేనని పేర్కొన్నారు.

జీవసాంకేతిక పరిజ్ఞానం సాయంతో గ్రహీత మూలకణాల్నే ఉపయోగించి అవయవాన్ని రూపొందించి అమర్చటం వల్ల గ్రహీత రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించే అవకాశాలు ఉండవన్నారు. అంటే.. ఎవరికి గుండె అవసరమైతే, వారి శరీరానికి తగిన గుండెను వారి మూలకణాలతోనే తయారుచేసి ఇవ్వగలమని పరిశోధకులు వివరించారు. మామూలుగా మూలకణాలు తమ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రతిస్పందిస్తుంటాయనీ, అందుకని, మూలకణాల్ని గుండెలోకి ఇంజెక్ట్‌ చేయటం వల్ల గుండె కణాలుగా, కణజాలంగా రూపొందే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇప్పటికైతే ఈ ప్రయోగం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా, సమీప భవిష్యత్తులోనే ఈ తరహా గుండెను తయారుచేసి మానవ శరీరంలోకి విజయవంతంగా మార్పిడి చేసే విజయాన్ని సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

source : sukhibhava@eenadu news paper 23-11-2012

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Test for stress by saliva,ఒత్తిడిని కనిపెట్టే లాలాజలం



  •  Test for stress by saliva,ఒత్తిడిని కనిపెట్టే లాలాజలం
మానసిక ఒత్తిడిని గుర్తించే సరికొత్త తరహా పరీక్ష పద్ధతి ఇది.--లాలాజలం గుండా లేజర్‌ కిరణాలను ప్రసరింపజేయటం ద్వారా ఒత్తిడి స్థాయుల్ని అంచనా వేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. నోటి నుంచి సేకరించే లాలాజలం గుండా ఆల్ట్రాఫాస్ట్‌ లేజర్లను పంపించటం ద్వారా ఒత్తిడి స్థాయుల్ని నిక్కచ్చిగా గుర్తించవచ్చని మణిపాల్‌ జీవశాస్త్ర కేంద్రం పరిశోధకులు మాథుర్‌ సంతోష్‌ పేర్కొన్నారు. ఈ పద్ధతిలో ప్రస్తుతం అనుసరిస్తున్న రక్త పరీక్షలకన్నా మంచి ఫలితాలు వెలువడుతాయని స్పష్టం చేస్తున్నారు. లాలాజలంలో ఉండే ప్రొటీన్‌ శారీరక, మానసిక ఒత్తిడును నిర్దిష్టంగా గుర్తిస్తుంది. దీని సాయంతో ఒత్తిడిని గుర్తించేందుకు లేజర్లను తాము మొట్టమొదటిసారిగా ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉందన్నారు.

ఒత్తిడిని గుర్తించే మరో పద్ధతి.. కాంతి పరీక్ష. ఇందులో.. కాంతిని లాలాజలం ద్వారా ప్రసరింపజేసినప్పుడు కాంతికి సంబంధించిన వర్ణాలు కుచించినట్లుగా ఏర్పడతాయి. ఇవెంతగా తక్కువగా ఏర్పడితే ఒత్తిడి స్థాయులు అంతగా ఎక్కువ ఉన్నట్లు గుర్తించాలి. ఈ తరహా పరీక్షపై కూడా మణిపాల్‌ కేంద్రంలో ప్రయోగాలు జరుగుతున్నాయి.
  • ===========================

Can we stop oldage?,వృద్ధాప్యాన్ని ఆపగలమా?

  •  

  •  Can we stop oldage?,వృద్ధాప్యాన్ని ఆపగలమా?
గాబి విలియమ్స్‌... ఎనిమిదేళ్ల అమ్మాయి. కానీ నెలల పాపలా కనిపిస్తుంది. బరువు ఐదు కిలోలకు మించదు. ఉయ్యాలలోంచి లేవలేదు. పాలు పట్టడం, డైపర్లు మార్చడం... పసిపాపని చూసినట్లే చూడాలి. ఫ్లోరిడాకి చెందిన 29 సంవత్సరాల ఓ యువకుడు కూడా ఇంతే. పదేళ్ల పిల్లాడిలానే ఉంటాడు. బ్రెజిల్‌కి చెందిన 31 సంవత్సరాల ఓ మహిళ అయితే రెండేళ్ల పాపలానే ఉంటుంది. ఎంత వయసు వచ్చినా వీళ్లింతే. పిల్లల మాదిరిగానే ఉండిపోతారు. అంటే వయసుతోపాటు పెరగడమూ, వయసుకు తగ్గ మార్పులు రావడమూ అనే సహజ ప్రక్రియ వీళ్లలో మందగించింది. శాస్త్రపరిభాషలో చెప్పాలంటే 'డెవలప్‌మెంటల్‌ ఇనర్షియా' అనే ప్రక్రియ ఆగిపోయింది. అంటే ఈ ప్రక్రియకు కారణమైన జన్యులోపంతో వీళ్లు బాధపడుతున్నారన్నమాట. అందుకే 'దీనికి కారణమైన జన్యువుని కనుగొని, మనిషి పూర్తిగా అభివృద్ధి చెందాక- అంటే 30 సంవత్సరాల వయసులో ఉండగా ఆ జన్యువుని పనిచేయకుండా ఆపివేయగలిగితే ఎప్పటికీ అలాగే ఉండిపోవచ్చు' అని ఈ విషయం మీద పరిశోధన చేస్తోన్న రిచర్డ్‌ ఎఫ్‌ వాకర్‌ పేర్కొంటున్నారు. అప్పుడు ఏ ప్రమాదవశాత్తో లేదా వ్యాధుల కారణంగానో మరణం సంభవించాల్సిందే తప్ప సహజమైన వృద్ధాప్యంతో ఎవరూ చనిపోరన్నది ఆయన విశ్లేషణ.