26 December 2013

Cause for uncontroled sleep,ఆపుకోలేని నిద్ర కు కారణము

  •  




  •  
 
కొందరు పగటిపూట కూడా తెగ నిద్ర పోతుంటారు. ఎంత ఆపుకొందామనుకున్నా ఆపుకోలేరు. ఎదుటివారితో మాట్లాడుతూనే, పనులు చేస్తూనే హఠాత్తుగా కునికిపాట్లు పడుతుంటారు. ఈ నిద్ర కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకూ ఉండొచ్చు. ఇది ప్రమాదాలకూ దారితీయొచ్చు. ఇలా ఆపుకోవటానికి వీల్లేకుండా ముంచుకొచ్చే నిద్ర సమస్యను 'నార్కోలెప్సీ' అంటారు. దీనికి మన రోగనిరోధకశక్తి గాడి తప్పటమే కారణమని చాలాకాలంగా అనుమానిస్తున్నా రుజువు కాలేదు. అయితే ఇది నిజమేనని పరిశోధకులు తాజాగా గుర్తించారు. హైపోక్రిటిన్‌ అనే రసాయనం మనం మెలకువగా ఉండటానికి తోడ్పడుతుంది. నార్కోలెప్సీ బాధితుల మెదడు లో ఈ రసాయనం స్థాయులు తక్కువగా ఉంటాయి. ఇందుకు హైపోక్రిటిన్‌ను ఉత్పత్తి చేసే మెదడు కణాలపై రోగనిరోధకశక్తి పొరపాటున దాడి చేయటం కారణమని భావిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ కణాలకు చెందిన ఒక ఉపవర్గం నార్కోలెప్సీ బారినపడ్డవారిలో ప్రత్యేకంగా కనబడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్యకు జన్యు సంబంధ అంశాలూ దోహదం చేస్తాయి. ఇలాంటి జన్యువులు గలవారిలో హైపోక్రిటిన్‌ మీద రోగనిరోధక వ్యవస్థ దాడి చేసేలా ఇన్‌ఫెక్షన్ల వంటివీ ప్రేరేపిస్తున్నాయని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఎలిజబెత్‌ మెలిన్స్‌ చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ బారినపడ్డ పిల్లల్లో నార్కోలెప్సీ సమస్య పెరగటమే దీనికి నిదర్శనమని వివరిస్తున్నారు. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు టీ కణాలను అయోమయానికి గురిచేసి హైపోక్రిటిన్‌ ఉత్పిత్తి చేసే కణాలపై దాడి చేసేలా పురికొల్పుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పగటినిద్రకు రాత్రుళ్లు త్వరగా పడుకోకపోవటం వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి కాబట్టి నార్కోలెప్సీని కచ్చితంగా నిర్ధరించటం కష్టమైన పని. అయితే తాజా పరిశోధన మున్ముందు ఈ సమస్యను గుర్తించే రక్తపరీక్షను రూపొందించేందుకు దారితీయగలదని ఆశిస్తున్నారు. దీంతో రోగనిరోధకశక్తిని తగ్గించే మందులతో చికిత్స చేసే అవకాశమూ ఉండొచ్చని భావిస్తున్నారు.

source : Health Screens and updates Journal
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Effect of Meditation on Genes,జన్యువులపైనా ధ్యానం ప్రభావం

  •  

  •  

ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందన్నది తెలిసిందే. ఇది శరీరంలో వాపుతో సంబంధం గల జన్యువుల వ్యక్తీకరణలో మార్పులనూ కలగజేస్తున్నట్టు తాజాగా తేలింది. అలాగే ఒత్తిడితో కూడిన ఘటనల నుంచి త్వరగా కోలుకునేట్టూ చేస్తున్నట్టు బయటపడింది. జన్యువులపై ధ్యానం ప్రభావాలను గుర్తించటానికి విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. 40 మందిని ఎంచుకొని పరిశీలించారు. కొందరితో ఎనిమిది గంటల సేపు ధ్యానం చేయించగా.. కొందరిని డాక్యమెంటరీలు చూడమని, పుస్తకాలు చదవమని, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుకోమని చెప్పారు. అనంతరం వీరి రక్తనమూనాలను పరీక్షించగా.. ధాన్యం చేసినవారిలో వాపుతో సంబంధం గల హెచ్‌డీఏసీ, ఆర్‌ఐపీకే2, కాక్స్‌2 జన్యువుల వ్యక్తీకరణలో తగ్గుదల కనిపించింది. పలు వ్యాధుల వృద్ధి, చికిత్సలో వాపు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శరీరంలో దీర్ఘకాల వాపు మూలంగా గుండెజబ్బు, కీళ్లవాతం, ఆస్థమా, ల్యూపస్‌, పెద్దపేగు పూత, క్యాన్సర్‌ వంటి జబ్బుల ముప్పు పొంచి ఉంటోందని గత అధ్యయనాల్లో వెల్లడైంది. నొప్పిని, వాపును తగ్గించటానికి ప్రస్తుతం వాడుతున్న మందులు కొన్ని జన్యువులను లక్ష్యంగా చేసుకొనే పనిచేస్తుంటాయి. ధ్యానం మూలంగా ఈ జన్యువుల్లోనే మార్పులు కనబడటం విశేషమని అధ్యయన నేత పెర్లా క్యాలిమన్‌ చెబుతున్నారు. అంతేకాదు.. ఒత్తిడికి లోనైన తర్వాత ఆర్‌ఐపీ2, హెచ్‌డీఏసీ జన్యువులు త్వరగా సాధారణ స్థాయికి రావటమూ గమనార్హం. శరీరంలో వాపు మూలంగా కణాలు త్వరగా వృద్ధాప్యానికీ లోనవుతాయి. రకరకాల దీర్ఘకాల సమస్యలకూ దారితీస్తాయి. అందువల్ల ధ్యానం వంటి పద్ధతులు ఆయుష్షును పెంచటానికీ తోడ్పడతాయని పరిశోధకులు వివరిస్తున్నారు
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

13 December 2013

x-ray is 10 thousand times thinner than hair,వెంట్రుక కన్నా పదివేల రెట్లు పలుచనైనది- ఎక్స్ రే.

  •  


  •  

బెర్లిన్‌: మనిషి శరీరంలో ఎముకలతోపాటు అనేక పదార్థాల నిర్మాణాన్ని చిత్రాల రూపంలోకి మలచేందుకు ఉపయోగించే ఎక్స్ రేల్లో అత్యంత పలుచనైన కిరణాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ గోటిన్‌జెన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. ప్రపంచంలోనే అతి పలుచనైన ఈ ఎక్స్ కిరణం మనిషి వెంట్రుక కన్నా 10 వేల రెట్లు పలుచగా ఉండటం విశేషం.ప్రస్తుత పద్ధతుల్లో సృష్టిస్తున్న ఎక్స్  కిరణాలు కనీసం 20 నానోమీటర్ల మందంలో ఉంటున్నాయని, తాము మాత్రం 5 నానోమీటర్ల వ్యాసంలోనే ఎక్స్ కిరణాన్ని సృష్టించగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్‌ చెప్పారు. సోలార్‌ సెల్స్ లో ఉపయోగించే నానోస్థాయి తీగలపై, రసాయన పదార్థాల్లో అతిసూక్ష్మ స్థాయి విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/