- Brain cleaned during sleep ,మంచినిద్రతో మెదడు పరిశుభ్రం
వాషింగ్టన్: మంచి నిద్ర మెదడును పరిశుభ్రపరిచేస్తుంది అని న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. బాగా నిద్రపోయే సమయంలో మెదడు కణాల మధ్య దూరం పెరుగుతుంది... తద్వారా కలుషితాలన్నీ కూడా కొట్టుకుపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నిద్రపోయేటప్పుడు మెదడులో 'లింఫాటిక్ సిస్టమ్' అనేది చురుగ్గా పనిచేయడంతో మెదడు పరిశుభ్రమౌతుందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
source : Eeandu news paper 19-10-2013
- ===========================
