30 August 2014

Sugar is bad to heart,గుండెకు చక్కెర ముప్పు

  •  
  •  
మధుమేహంపై చక్కెర ప్రభావం ఉంటుందన్నది తెలిసిందే. ఇది గుండెపైనా ప్రభావం చూపుతుందా? అవుననే అంటున్నారు ఒటాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు. గుండెజబ్బును తెచ్చిపెట్టే కారకాలపై చక్కెర నేరుగా ప్రభావం చూపుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. గుండెజబ్బు ముప్పు కారకాల్లో అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులదే అగ్రస్థానం. చక్కెరను కలిపి తయారుచేసే పదార్థాలు, పానీయాలు ఇలాంటి ముప్పు కారకాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానిపై అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు సాగాయి. ఒటాగా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల వీటిన్నింటినీ క్రోడీకరించి విశ్లేషించారు. గుండెజబ్బు ముప్పునకు చక్కెర దోహదం చేస్తున్నట్టు ఇందులో బయటపడింది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌పై ఒక మాదిరిగా ప్రభావం చూపుతున్నప్పటికీ.. బరువు పెరగటంలో మాత్రం గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. అందువల్ల ఆహార పదార్థాల్లో కలిపే చక్కెర మోతాదులను తగ్గించాల్సిన అవసరముందని అధ్యయన నేత టె మోరెంగా సూచిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల భారాన్ని తగ్గించటానికి తోడ్పడగలదని వివరిస్తున్నారు. పిండి పదార్థాలు, కేలరీల మోతాదులు సమానంగా ఉన్నప్పుడు ఆహార పదార్థాల్లో చక్కెర స్థాయిలు ఎక్కువున్నా, తక్కువున్నా బరువు పెరగటంపై ప్రత్యేకమైన ప్రభావం చూపటం లేదని గత అధ్యయనాలు కొన్ని సూచిస్తున్నాయి. కానీ ఇది నిజం కాదని ఇప్పుడు గుర్తించారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

29 August 2014

saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం

  •  
  •  

saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం!
మెల్‌బోర్న్‌: కాలేయ క్యాన్సర్‌ కారక పరాన్నజీవి ఉమ్మిలో ఎంతకీ మానని పుండ్లను నయం చేసే గుణముందని జేమ్స్‌ కుక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త మైఖేల్‌ స్మౌట్‌ పేర్కొన్నారు. 'లివర్‌ ఫ్లూక్‌' అనే పరాన్నజీవి కాలేయ క్యాన్సర్‌కు ఎలా దారితీస్తుందో? మానని పుండ్లకు చికిత్సలను రూపొందించటానికి ఎలా తోడ్పడుతుందో? అనే అంశాలను ఆయన తన తాజా అధ్యయనంలో వివరించారు. లివర్‌ ఫ్లూక్‌ పరాన్నజీవి ఉమ్మిలోని గ్రాన్యులిన్‌ అనే అణువు అధిక సంఖ్యలో కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది. అయితే ఇది గాయాలు మానటాన్నీ ప్రోత్సహిస్తున్నట్టు స్మౌట్‌ గుర్తించారు. ''ఇదెలా పనిచేస్తుందో తెలియదు. కానీ కాలేయంలో దాని మూలంగా పుట్టుకొచ్చే గాయాలనూ అదే నయం చేస్తుంది. నిజానికి ఇది మనిషికి మేలు చేసేదే. కానీ తరచుగా గాయాలు అవుతూ.. మానుతూ.. ఇలా చాలాకాలం కొనసాగితే మాత్రం క్యాన్సర్‌కు దారితీస్తుంది'' అని ఆయన వివరించారు.


===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Old age speedup with cigarete smoking-సిగరెట్‌ పొగతో త్వరగా వృద్ధాప్యం

  •  


  • Old age speedup with cigarete smoking-సిగరెట్‌ పొగతో త్వరగా వృద్ధాప్యం
వాషింగ్టన్‌: కొందరు తమ వయసు కన్నా చిన్నగా కనబడితే.. మరికొందరు పెద్దగా కనబడుతుంటారు కదా. దీనికి కారణమేంటో తెలుసా? మన చుట్టూరా వాతావరణంలో ఉండే 'వయో కారకాల' ప్రభావానికి గురికావటమేనని పరిశోధకులు గుర్తించారు. వాతావరణంలోని బెంజీన్‌ వంటి రసాయనాలు, సిగరెట్‌ పొగ వంటి హానికర పదార్థాలతో పాటు ఒత్తిడి కూడా త్వరగా వృద్ధాప్యం బారిన పడటానికి కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఇలాంటి 'వయో కారకాలు' వ్యక్తుల్లో శారీరక వయసుపై ప్రభావం చూపుతున్నాయని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన నార్మన్‌ షార్ప్‌లెస్‌ పేర్కొన్నారు. పర్యావరణంలోని వయో కారకాలను గుర్తించివాటికి దూరంగా ఉండటం వల్ల జీవనకాలాన్ని పెంచుకునే అవకాశముందని వివరించారు. సిగరెట్‌ అన్నింటికన్నా ముఖ్యమైన వయో కారకమని షార్ప్‌లెస్‌ తెలిపారు. సిగరెట్ల మూలంగా క్యాన్సర్‌ వస్తుందని తెలుసు. అయితే రక్తనాళాలు గట్టిపడటం, వూపిరితిత్తులు గట్టిపడటం వంటి ఇతరత్రా సమస్యలకూ వీటితో సంబంధం ఉంటోందని వివరించారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

17 August 2014

Cancer controle hunting cells, క్యాన్సర్‌ పనిపట్టే హంతక కణాలు

  •  


  •  
Cancer controle hunting cells, క్యాన్సర్‌ పనిపట్టే హంతక కణాలు

మెల్‌బోర్న్‌: సహజ హంతక కణాలుగా పేరు పొందిన ప్రత్యేకమైన రోగ నిరోధక కణాలు మెలనోమా అనే క్యాన్సర్‌ కణాలను తుదముట్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో విస్తరించిన క్యాన్సర్లను వీటి సాయంతో చంపేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎముక మజ్జ మార్పిళ్లను శరీరం తిరస్కరించేలా చేయడంలోనూ ఈ హంతక కణాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేల్చారు. ఆస్ట్రేలియాలోని వాల్టర్‌ అండ్‌ ఎలీజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ఈ హంతక కణాలు శరీరాన్ని ఆసాంతం పరిశీలిస్తూ, వైరస్‌ వంటి చొరబాటుదారులను పసిగడతాయి. క్యాన్సర్‌ కారణంగా కణాల్లో వస్తున్న మార్పులను కూడా గుర్తిస్తాయి. ఒక చోట నుంచి మరో చోటుకు విస్తరిస్తున్న క్యాన్సర్‌ కణాలపై పోరాడటానికి ఇవి అవసరమని పరిశోధనలో పాల్గొన్న నిక్‌ హంటింగ్‌టన్‌ చెప్పారు. . ఎంసీఎల్‌-1ను లక్ష్యంగా చేసుకొని, శరీరంలో హంతక కణాలను వృద్ధి చేసుకోవచ్చని, తద్వారా క్యాన్సర్‌పై పోరును తీవ్రం చేయవచ్చని తెలిపారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Mercury in beauty products,సౌందర్య లేపనాలలో పాదరసం




  •  
  •  
  • Mercury in beauty creams and products,సౌందర్య లేపనాలలో పాదరసం

వేగంగా గుర్తించేందుకు ఇప్పుడు సరికొత్త విధానం--వాషింగ్టన్‌: హానికారక పాదరసం కలిగిన సౌందర్య లేపనాలను కొంతమంది ముఖానికి పులుముకోవడం, చర్మం కిందకు చొప్పించుకోవడం వంటివి చేస్తున్నారని అమెరికా పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల చర్మం నిగారింపు పెరుగుతుందని భావిస్తున్నారని తెలిపారు. అయితే దానివల్ల తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. సౌందర్య ఉత్పత్తుల్లో పాదరసం స్థాయిని 1 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం) మించకూడదని అమెరికాలో ప్రమాణాలు నిర్దేశించారు. అయితే కొన్ని ఉత్పత్తుల్లో 2.10 లక్షల పీపీఎం మేర కూడా ఈ రసాయనం ఉంటోంది. ఆ ఉత్పత్తిని నిత్యం వాడితే మన చేతి మీద అది ఉండిపోతుందని, తద్వారా ఆహారంలోకి, చిన్నారులు నిద్రించే షీట్లపైకి పాదరసం చేరుతుందని కాలిఫోర్నియా ప్రజారోగ్యశాఖకు చెందిన గోర్డాన్‌ పేర్కొన్నారు. పైపెచ్చు దీనివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడటం, మూత్రపిండాలు దెబ్బతినడం, తలనొప్పి, అలసట, చేతులు వణకడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Asprin can controle progress of breastcance,ఆస్ప్రిన్‌తో రొమ్ము క్యాన్సర్‌ అదుపు(controle)చేయవచ్చును

  •  

  •  
రోగం తిరిగి తలెత్తే ప్రమాదం తగ్గుతుంది: శాస్త్రవేత్తలు---వాషింగ్టన్‌: మెనోపాజ్‌ తర్వాత రొమ్ము క్యాన్సర్‌కు గురైన వూబకాయ మహిళలకు ఆస్ప్రిన్‌, ఇబుప్రొఫెన్‌ వంటి వాపు నివారణ మందులు మేలు చేస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. వారిలో ఆ జబ్బు తిరిగి తలెత్తే ప్రమాదం తగ్గుతుందని వివరించారు.
టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాన్సర్‌ థెరపీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీటీఆర్‌సీ) శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో రక్త సీరంను పరిశీలించారు. వీరు కొవ్వు కణాల కల్చర్‌లో ఈ సీరంను ఉంచారు. ఆ తర్వాత దాన్ని రొమ్ము క్యాన్సర్‌ కణాలపై ఉంచారు. మిగతా రోగులతో పోలిస్తే వూబకాయమున్న రోగుల సీరం.. క్యాన్సర్‌ కణాలను మరింత వేగంగా వృద్ధి చెందిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. వూబకాయమున్న రోగుల సీరంలో ప్రోస్టాగ్లాండిన్స్‌ ఎక్కువగా ఉందని పరిశోధనలో పాలుపంచుకున్న ఆండ్రూ బ్రెన్నర్‌ తెలిపారు. వాపులో దీనికి పాత్ర ఉంటుందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా రోగుల్లో సీవోఎక్స్‌2 ఇన్హిబిటర్లు (ఆస్ప్రిన్‌ లేదా ఇబుప్రొఫెన్‌) వాడుతున్న రోగులను వేరుచేసి, పరిశీలించారు. వారిలో క్యాన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం 50 శాతం మేర తగ్గుతోందని గుర్తించారు. ఈ మందుల వల్ల వారిలో క్యాన్సర్‌రహిత కాలం రెండేళ్లకు పెరిగిందని బ్రెన్నర్‌ తెలిపారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

13 August 2014

Treatment for cancer cells,క్యాన్సర్‌ కణాల చికిత్స



 Treatment for cancer cells,క్యాన్సర్‌ కణాల చికిత్స
లండన్‌: క్యాన్సర్‌ కణాలు తమంతటతామే ధ్వంసమయ్యే ఒక సరికొత్త చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు నాందిపలికారు. దీంట్లో భాగంగా వీరు ఒక వినూత్నమైన అణువుకు రూపకల్పన చేశారు. ఇది క్యాన్సర్‌ కణాల్లోకి సోడియం, క్లోరైడ్‌ అయాన్లను తీసుకెళ్తుంది. ఈ అయాన్లు క్యాన్సర్‌ కణాలు స్వయంగా ధ్వంసమయ్యేలా చేస్తాయి. సాధారణంగా మనశరీరంలో అయాన్లు ఒక నిర్దిష్టమైన సమతుల్యతతో ఉంటాయి. కణాలు ఈ సమతుల్యతను ఎప్పటికప్పుడు కాపాడుకుంటాయి. ఎప్పుడైనా అది దెబ్బతిన్నప్పుడు.. కణాలు 'ఆత్మహత్య'కు పాల్పడుతుంటాయి. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాదకరమైన, దెబ్బతిన్న కణాలను శరీరం వదిలించుకుంటుంది. సహజసిద్ధమైన ఈ ప్రక్రియను ఉపయోగించుకోవటం ద్వారా క్యాన్సర్‌ వ్యాధికి మెరుగైన చికిత్సను అభివృద్ధి చేయవచ్చని టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు భావించారు. ఈ మేరకు వీరు అయాన్ల రవాణాకు ఒక కృత్రిమ అణువును రూపొందించి.. దానిద్వారా క్యాన్సర్‌ కణాలకు సోడియం, క్లోరైడ్‌ అయాన్లను పంపించారు. ప్రయోగశాలలో వీరు జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

12 August 2014

cancer treatment with vascular gene-రక్తనాళాల జన్యువుతో క్యాన్సర్‌కు చికిత్స

  •  

లండన్‌: రక్తనాళాలను సృష్టించే ఒక జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల క్యాన్సర్‌, గుండెజబ్బులు, పక్షవాతానికి సమర్థవంతమైన చికిత్సను అందించవచ్చని భావిస్తున్నారు. లీడ్స్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. 'పీజోల్‌' అనే జన్యువు రక్తనాళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించే శరీరంలోని సెన్సర్లకు ఆదేశాలు జారీ చేస్తుందని వీరి పరిశీలనలో తేలింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ డేవిడ్‌ బీచ్‌ మాట్లాడుతూ.. శరీరంలోని రక్తనాళాల వ్యవస్థ అనేది ముందుగానే ఏర్పాటయ్యేది కాదు. రక్తప్రవాహాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ రూపొందుతుంది. ఈ క్రమంలో పీజోల్‌ జన్యువు అత్యంత కీలకం. రక్తప్రవాహానికి అనుగుణంగా రక్తనాళాలను ఏర్పాటుచేసే ప్రోటీన్‌కు పీజోల్‌ నుంచే ఆదేశాలు వెళ్తాయి'' అని తెలిపారు. ఈ పరిశోధన నేపథ్యంలో.. క్యాన్సర్‌ బాధితుల్లో పీజోల్‌ జన్యువును నియంత్రించటం ద్వారా క్యాన్సర్‌ కణాలకు రక్తసరఫరా జరగకుండా చూడవచ్చని, తద్వారా ఆ కణాలను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రక్తసరఫరాలో తలెత్తే అడ్డంకుల వల్ల సంభవించే గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులను కూడా కొత్తకోణంలో అర్థం చేసుకొని, నూతన చికిత్సలను అభివృద్ధి చేయటానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/