13 August 2014

Treatment for cancer cells,క్యాన్సర్‌ కణాల చికిత్స



 Treatment for cancer cells,క్యాన్సర్‌ కణాల చికిత్స
లండన్‌: క్యాన్సర్‌ కణాలు తమంతటతామే ధ్వంసమయ్యే ఒక సరికొత్త చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు నాందిపలికారు. దీంట్లో భాగంగా వీరు ఒక వినూత్నమైన అణువుకు రూపకల్పన చేశారు. ఇది క్యాన్సర్‌ కణాల్లోకి సోడియం, క్లోరైడ్‌ అయాన్లను తీసుకెళ్తుంది. ఈ అయాన్లు క్యాన్సర్‌ కణాలు స్వయంగా ధ్వంసమయ్యేలా చేస్తాయి. సాధారణంగా మనశరీరంలో అయాన్లు ఒక నిర్దిష్టమైన సమతుల్యతతో ఉంటాయి. కణాలు ఈ సమతుల్యతను ఎప్పటికప్పుడు కాపాడుకుంటాయి. ఎప్పుడైనా అది దెబ్బతిన్నప్పుడు.. కణాలు 'ఆత్మహత్య'కు పాల్పడుతుంటాయి. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాదకరమైన, దెబ్బతిన్న కణాలను శరీరం వదిలించుకుంటుంది. సహజసిద్ధమైన ఈ ప్రక్రియను ఉపయోగించుకోవటం ద్వారా క్యాన్సర్‌ వ్యాధికి మెరుగైన చికిత్సను అభివృద్ధి చేయవచ్చని టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు భావించారు. ఈ మేరకు వీరు అయాన్ల రవాణాకు ఒక కృత్రిమ అణువును రూపొందించి.. దానిద్వారా క్యాన్సర్‌ కణాలకు సోడియం, క్లోరైడ్‌ అయాన్లను పంపించారు. ప్రయోగశాలలో వీరు జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.