17 August 2014

Asprin can controle progress of breastcance,ఆస్ప్రిన్‌తో రొమ్ము క్యాన్సర్‌ అదుపు(controle)చేయవచ్చును

  •  

  •  
రోగం తిరిగి తలెత్తే ప్రమాదం తగ్గుతుంది: శాస్త్రవేత్తలు---వాషింగ్టన్‌: మెనోపాజ్‌ తర్వాత రొమ్ము క్యాన్సర్‌కు గురైన వూబకాయ మహిళలకు ఆస్ప్రిన్‌, ఇబుప్రొఫెన్‌ వంటి వాపు నివారణ మందులు మేలు చేస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. వారిలో ఆ జబ్బు తిరిగి తలెత్తే ప్రమాదం తగ్గుతుందని వివరించారు.
టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాన్సర్‌ థెరపీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీటీఆర్‌సీ) శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో రక్త సీరంను పరిశీలించారు. వీరు కొవ్వు కణాల కల్చర్‌లో ఈ సీరంను ఉంచారు. ఆ తర్వాత దాన్ని రొమ్ము క్యాన్సర్‌ కణాలపై ఉంచారు. మిగతా రోగులతో పోలిస్తే వూబకాయమున్న రోగుల సీరం.. క్యాన్సర్‌ కణాలను మరింత వేగంగా వృద్ధి చెందిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. వూబకాయమున్న రోగుల సీరంలో ప్రోస్టాగ్లాండిన్స్‌ ఎక్కువగా ఉందని పరిశోధనలో పాలుపంచుకున్న ఆండ్రూ బ్రెన్నర్‌ తెలిపారు. వాపులో దీనికి పాత్ర ఉంటుందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా రోగుల్లో సీవోఎక్స్‌2 ఇన్హిబిటర్లు (ఆస్ప్రిన్‌ లేదా ఇబుప్రొఫెన్‌) వాడుతున్న రోగులను వేరుచేసి, పరిశీలించారు. వారిలో క్యాన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం 50 శాతం మేర తగ్గుతోందని గుర్తించారు. ఈ మందుల వల్ల వారిలో క్యాన్సర్‌రహిత కాలం రెండేళ్లకు పెరిగిందని బ్రెన్నర్‌ తెలిపారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.