30 August 2014

Sugar is bad to heart,గుండెకు చక్కెర ముప్పు

  •  
  •  
మధుమేహంపై చక్కెర ప్రభావం ఉంటుందన్నది తెలిసిందే. ఇది గుండెపైనా ప్రభావం చూపుతుందా? అవుననే అంటున్నారు ఒటాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు. గుండెజబ్బును తెచ్చిపెట్టే కారకాలపై చక్కెర నేరుగా ప్రభావం చూపుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. గుండెజబ్బు ముప్పు కారకాల్లో అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులదే అగ్రస్థానం. చక్కెరను కలిపి తయారుచేసే పదార్థాలు, పానీయాలు ఇలాంటి ముప్పు కారకాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానిపై అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు సాగాయి. ఒటాగా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల వీటిన్నింటినీ క్రోడీకరించి విశ్లేషించారు. గుండెజబ్బు ముప్పునకు చక్కెర దోహదం చేస్తున్నట్టు ఇందులో బయటపడింది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌పై ఒక మాదిరిగా ప్రభావం చూపుతున్నప్పటికీ.. బరువు పెరగటంలో మాత్రం గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. అందువల్ల ఆహార పదార్థాల్లో కలిపే చక్కెర మోతాదులను తగ్గించాల్సిన అవసరముందని అధ్యయన నేత టె మోరెంగా సూచిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల భారాన్ని తగ్గించటానికి తోడ్పడగలదని వివరిస్తున్నారు. పిండి పదార్థాలు, కేలరీల మోతాదులు సమానంగా ఉన్నప్పుడు ఆహార పదార్థాల్లో చక్కెర స్థాయిలు ఎక్కువున్నా, తక్కువున్నా బరువు పెరగటంపై ప్రత్యేకమైన ప్రభావం చూపటం లేదని గత అధ్యయనాలు కొన్ని సూచిస్తున్నాయి. కానీ ఇది నిజం కాదని ఇప్పుడు గుర్తించారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.