వాషింగ్టన్: కళ్లద్దాలుగానీ, కాంటాక్టు లెన్సులుగానీ లేకుండానే కంటిచూపు సమస్యలను అధిగమించవచ్చని కొత్త టెక్నాలజీ నిరూపిస్తోంది. అల్గారిథమ్స్ ఆధారంగా ఇది పని చేస్తుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ఈ పరిజ్ఞానాన్ని రూపొందించాయి. దీనిని సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలకు అనుసంధానించినప్పుడు అవి.. వ్యక్తి చూపును బట్టి దృశ్యంలో స్పష్టతను మార్చుకుంటాయి. దీనివల్ల ఒకవ్యక్తి కంటిచూపు ఎంత మందగించినా ఎదుటనున్న తెరపై ఉన్న దానిని స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. అద్దాలు, కాంటాక్ట్ లెన్సుల వంటివాటితో మెరుగుపడటానికి సాధ్యంకాని స్థాయిలో కంటిచూపును కోల్పోయిన వారికి ఇదో వరం.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/