18 September 2014

తల్లిపాలు తో ఎలర్జీలు దూరము

  •  


  •  
తల్లిపాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు రాకుండానూ కాపాడుతున్నట్టు తాజాగా బయపడింది. పిల్లలకు ఘనాహారం తినిపించటం మొదలుపెట్టిన సమయంలో తల్లిపాలు ఇవ్వటమూ కొనసాగిస్తే.. అలర్జీల ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి ఆహార అలర్జీలతో బారినపడ్డ 41 మంది పిల్లలను, అలర్జీలేవీ లేని 82 మంది పిల్లలను పోల్చి ఈ విషయాన్ని గుర్తించారు. ఘనాహారాన్ని తట్టుకునే ప్రక్రియలను తల్లిపాలు ప్రోత్సహిస్తాయని, అందువల్ల రోగ నిరోధకవ్యవస్థకు మేలు కలుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరు నెలల్లోపు పిల్లల పేగులు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటాయి. కాబట్టి ఆలోపు ఘనాహారాన్ని ఆరంభిస్తే వాళ్లు తట్టుకోలేరు. ఇది ఆహార అలర్జీలకూ దారితీయొచ్చు. కాబట్టి ఆరు నెలల తర్వాతే పిల్లలకు ఘనాహారాన్ని మొదలుపెట్టాలి. అప్పటివరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.