వాషింగ్టన్: రోజుకి మూడు కప్పుల కాఫీ తాగితే.. కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతానికి పైగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగే కాలేయ క్యాన్సర్ రకాలలో ఎక్కువగా కనబడే హెపటోసెల్యులార్ కార్సినోమా (హెచ్‌సీసీ) ముప్పూ సుమారు 40% మేరకు తగ్గుతున్నట్టు వెల్లడైంది. ప్రపంచంలో అతి ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో కాలేయ క్యాన్సర్ ఆరోది. మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది మూడోది. కాఫీ ఆరోగ్యానికి.. ముఖ్యంగా కాలేయానికి మంచిదనే గత అధ్యయనాలను తమ పరిశోధన మరింత బలపరిచిందని అధ్యయన నేత కార్లో లా వెచియా తెలిపారు. కాఫీలో మధుమేహ నివారణకు, కాలేయం గట్టిపడకుండా చేసే గుణాలు ఉన్నాయని.. ఇవే కాలేయ క్యాన్సర్ ముప్పు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.
source : Eenadu News paper -6:32 AM 10/24/2013
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/