Showing posts with label saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం. Show all posts
Showing posts with label saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం. Show all posts

29 August 2014

saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం

  •  
  •  

saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం!
మెల్‌బోర్న్‌: కాలేయ క్యాన్సర్‌ కారక పరాన్నజీవి ఉమ్మిలో ఎంతకీ మానని పుండ్లను నయం చేసే గుణముందని జేమ్స్‌ కుక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త మైఖేల్‌ స్మౌట్‌ పేర్కొన్నారు. 'లివర్‌ ఫ్లూక్‌' అనే పరాన్నజీవి కాలేయ క్యాన్సర్‌కు ఎలా దారితీస్తుందో? మానని పుండ్లకు చికిత్సలను రూపొందించటానికి ఎలా తోడ్పడుతుందో? అనే అంశాలను ఆయన తన తాజా అధ్యయనంలో వివరించారు. లివర్‌ ఫ్లూక్‌ పరాన్నజీవి ఉమ్మిలోని గ్రాన్యులిన్‌ అనే అణువు అధిక సంఖ్యలో కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది. అయితే ఇది గాయాలు మానటాన్నీ ప్రోత్సహిస్తున్నట్టు స్మౌట్‌ గుర్తించారు. ''ఇదెలా పనిచేస్తుందో తెలియదు. కానీ కాలేయంలో దాని మూలంగా పుట్టుకొచ్చే గాయాలనూ అదే నయం చేస్తుంది. నిజానికి ఇది మనిషికి మేలు చేసేదే. కానీ తరచుగా గాయాలు అవుతూ.. మానుతూ.. ఇలా చాలాకాలం కొనసాగితే మాత్రం క్యాన్సర్‌కు దారితీస్తుంది'' అని ఆయన వివరించారు.


===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/