వాషింగ్టన్: సంక్లిష్ట అల్గారిథమ్‌లతో కూడిన సాధారణ వీడియో కెమేరా గుండె, శ్వాసక్రియ రేట్లను నిర్దిష్టంగా గుర్తించడంలో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో కీలక సంకేతాలను గుర్తించే విషయంలో ఇది చవకైన పద్ధతి అనీ, రోగిని తాకుండానే వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు. టెలిమెడిసిన్ ప్రక్రియలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. గుండెపోటు, పక్షవాతం వంటివాటిని ఇంటివద్దే గుర్తించడంలోనూ, ఆకస్మిక శిశు మరణాల వంటి సమస్యను నిర్ధరించడంలోనూ తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనేది గుండె, శ్వాసక్రియ రేట్లే చెబుతాయని జార్జియా రీజెంట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్ జో సియెన్ పేర్కొన్నారు. తాము రూపొందించిన అల్గారిథమ్‌లు వేగంగా, నిక్కచ్చిగా అంచనా వేస్తాయని స్పష్టం చేశారు. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా పలువురు ప్రముఖుల టీవీ దృశ్యాలను తమ పరికరంతో పరీక్ష చేసి చూశారు.(6:24 PM 20-Oct-13)
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/