వాషింగ్టన్: సంతానం లేని మహిళల అండాశయంలో అండాలను ఉత్పత్తి చేసి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 'ఇన్‌విట్రో యాక్టివేషన్' (ఐవీఏ) అనే ఈ పద్ధతిని అమెరికా, జపాన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధిపరిచారు. మహిళ అండాశయాన్నిగానీ, అండాశయంలోని కొంత భాగాన్నిగానీ తొలగించి అవసరమైన చికిత్సను అందజేసి తిరిగి మహిళ ఫాలోపియన్ ట్యూబుల వద్ద అమరుస్తారు. అనంతరం, కొన్ని హార్మోన్ల ద్వారా మహిళకు చికిత్స జరిపి.. అండాశయంలో అండాలు ఉత్పత్తి అయ్యేలా ప్రేరణ కలిగిస్తారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీసుకురాగలిగారు.(5:46 AM 10/2/2013)
- ===========================