మెల్‌బోర్న్: పొట్టలో ఉన్న రెండు హార్మోన్ల మోతాదును పెంచటం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన గార్వెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించారు. ఎలుకల్లోకి ''పీవైవై3-36'', ''పీపీ'' అనే రెండు రకాల హార్మోన్లను వారు పంపించారు. అనంతరం వాటిని పరిశీలించినప్పుడు.. ఎలుకలు అంతకుముందుకన్నా తక్కువగా తింటున్నాయని, వాటిలో కొవ్వు తక్కువగా పేరుకుపోయిందని, ఇన్సులిన్ నిరోధకత (మధుమేహానికి ముందు కనిపించే లక్షణం) అలవడలేదని వెల్లడైంది. సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట నిండినట్లు అనిపించగానే ఆ సందేశాన్ని పీవైవై3-36, పీపీ హార్మోన్లే మెదడుకు అందజేస్తుంటాయి. వీటివల్లే తినటాన్ని ఆపేస్తాం. ఈ హార్మోన్ల ఆధారంగా స్థూలకాయానికి మందులను తయారుచేయటానికి ఔషధ కంపెనీలు ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, వీటి ప్రభావం అణుస్థాయిలో మెదడుపై ఎలా ఉంటుందన్నది ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తొలిసారిగా తెలిసింది.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/