07 November 2013

Early sleeping in children is a solution,త్వరగా నిద్రపోవడం పిల్లల్లో వూబకాయానికి పరిష్కారం

  •  

  •  
వాషింగ్టన్‌: త్వరగా నిద్రపుచ్చడం వల్ల పిల్లల్లో వూబకాయం సమస్య తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. వూబకాయులైన చిన్నారులకు పెందలాడే నిద్రపోవడం అలవాటు చేస్తే....సత్ఫలితాలు కనిపించినట్లు వారు తెలిపారు. పిల్లల ఆహారపుటలవాట్లపై నిద్రవేళల ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. పరిశోధకులు తమ అధ్యయనం నిమిత్తం 8-11 సంవత్సరాల వయసు పిల్లలను ఎంపిక చేసుకున్నారు. ఇందులో అధికబరువున్న వారూ ఉన్నారు. వీరిని మొదట వారం రోజుల పాటు వారెలాంటి సమయాల్లో నిద్రపోతారో అదే వేళలను పాటించారు. ఆ తర్వాత రెండోవారంలో వారి నిద్రవేళలను కాస్త పెంచారు. దీంతో, వారి ఆహారం స్వీకరించే తీరులో తేడా కనిపించింది. ఆకలికి కారణమయ్యే 'లెప్టిన్‌' స్థాయులూ తగ్గినట్లు తేలింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New medicine for Lung cancer,వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సకు కొత్త ఔషధం

  •  
  •  
లాస్‌ఏంజెల్స్‌: చర్మసంబంధ క్యాన్సర్‌ వైద్యానికి ఉపయోగిస్తున్న ఓ ప్రయోగాత్మ ఔషధాన్ని వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలోనూ వాడొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎం.కె.3475గా వ్యవహరించే ఈ కొత్త ఔషధానికి సంబంధించిన పరిశోధనల ప్రాథమిక ఫలితాలను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఛాతీక్యాన్సర్‌ అధ్యయన విభాగ సంచాలకుడు ఎడ్వర్డ్‌ గారన్‌ వెల్లడించారు. ప్రాథమిక ఫలితాలను ఆధారంగా చేసుకుని మెరుగైన ఫలితాల కోసం మందు మోతాదు మార్చి పరిశోధనలు కొనసాగించేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

patch to Support to heart muscle,దెబ్బతిన్న గుండెకు పట్టీ అండ




వాషింగ్టన్‌: దెబ్బతిన్న గుండె కండరం వేగంగా కోలుకోవటానికి తోడ్పడే కొత్తరకం పట్టీని పరిశోధకులు సృష్టించారు. కండరాల్లో ఉండే ప్రోటీన్‌(కొలాజెన్‌)ను మార్పుచేసి కూర్చి దీనిని తయారుచేశారు. గుండె కండరం మీద అతికిస్తే దెబ్బతిన్న భాగం త్వరగా బాగవటానికిది తోడ్పడుతుంది. మన గుండె కండరం దెబ్బతింటే దానికి త్వరగా కోలుకునే సామర్థ్యం లేదు. అందువల్ల ఈ ప్రక్రియను ప్రోత్సహించటంపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ల్యూసైల్‌ పకార్డ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పరిశోధకులు మార్పుచేసిన కొలాజెన్‌తో కూడిన కొత్తరకం పట్టీని రూపొందించారు. దీన్ని ఎలుకల్లో దెబ్బతిన్న గుండె కండరంపై అతికించగా.. కొత్త కణాల పుట్టుక పుంజుకోవటమే కాదు, దెబ్బతిన్న భాగంలో రక్తనాళాలు కూడా పుట్టుకొచ్చినట్టు తేలింది. ఈ పట్టీ గుండె కండరంలో చనిపోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయటానికి బదులు.. గుండె కణజాలం పైపొర స్థానాన్ని ఆక్రమిస్తుంది. కండర కణజాలం కాకపోయినప్పటికీ ఈ పొర గుండె కండరానికి దన్నుగా నిలుస్తుంది. దాన్ని కాపాడుతుంది.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

increase lifespan with gene change ,జన్యుమార్పుతో 20 శాతం అధిక ఆయుష్షు

  •  


  •  
వాషింగ్టన్‌ : జన్యుమార్పుతో మానవుల ఆయుష్షును పెంచుకోవడం సాధ్యమేనని చెబుతున్నారు అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌కి చెందిన పరిశోధకులు. ఆ లక్ష్యంగా సాగిన తమ పరిశోధనలతో చిట్టెలుక ఆయుష్షును 20 శాతం పెంచామని అంటున్నారు. ఈ ప్రయోగం మానవుల్లోనూ విజయవంతమైతే మామూలు కన్నా 16 ఏళ్లపాటు ఆయుష్షు పెరగవచ్చని చెబుతున్నారు. ముందుగా శాస్త్రవేత్తలు చిట్టెలుక జీవక్రియకు తోడ్పడే 'ఎం-టీఓఆర్‌' అనే జన్యువు 'వ్యక్తీకరణను' తగ్గించి దాని శక్తిని మందగించారు. మామూలు ఆడచిట్టెలుకలు 26.5 నెలలు జీవిస్తే.. జన్యుమార్పిడికి లోనైనవి 31.5 నెలలు జీవించాయట. వృద్ధాప్యంలోనూ మిగతావాటికంటే ఎక్కువ మేధస్సుతో, చురుగ్గానే ఉన్నాయట. అయితే.. జన్యుమార్పిడితో సమస్యలు లేకపోలేదు. సాధారణ చిట్టెలుకలకంటే వీటి ఆకారం కొద్దిగా చిన్నగానే ఉందట. వృద్ధాప్యంలో మేధోపరంగా మంచి చురుకుదనం ఉన్నా.. వీటి ఎముకలు తొందరగా క్షీణించాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

poverty may decrease intellicence,పేదరికం మేధోసామర్థ్యాన్ని తగ్గిస్తుంది

  •  
  •  
భారత్‌, అమెరికా అధ్యయనంలో వెల్లడి--
వాషింగ్టన్‌: సొమ్ములు తక్కువగా ఉంటే మేధోసామర్థ్యం కూడా తగ్గిపోతుందని తాజా అధ్యయనం చెబుతోంది. న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌ మాల్‌కి వచ్చేవారు, భారత్‌లోని రైతులపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు అంతర్జాతీయ పరిశోధక బృందం తెలిపింది. ఆర్థిక ఒత్తిడి వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయని చివరికి నిద్రలేని రాత్రులు గడుపుతుంటారని చెప్పింది. ''మా పరిశోధన పేదరికం గురించి కాదు. అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారనేది'' అని హార్వర్డ్‌ ఆర్థికవేత్త, పరిశోధక బృందం సభ్యుడు సెంథిల్‌ ముల్త్లెనాథన్‌ తెలిపారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వారు సొమ్ములు లేవన్న బాధతో ఉంటారని భావించాం.. కానీ వారిలో మేధో సామర్థ్యం తగ్గడం గుర్తించాం అని ఆయన వివరించారు. గడువు దాటిన చెల్లింపులు, అద్దె, రుణాలు వంటి వాటి గురించి అదే పనిగా ఆలోచించే వారి ఆలోచనలు ఇతర అంశాల మీదకు మళ్లుతున్నాయన్నారు. అధ్యయనంలో వేర్వేరు అంశాలపై వీరి ఐక్యూ పరీక్షించగా 13గా తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియా ప్రొఫెసర్‌ జియెంగ్‌ జావో తెలిపారు. అధ్యయనంలో భాగంగా సెంట్రల్‌ న్యూజెర్సీలోని క్వాకెర్‌ బ్రిడ్జ్‌ మాల్‌లో 400 మంది వినియోగదారులు, భారత్‌లోని 464 మంది చెరకు రైతులను పరిశీలించారు. ''న్యూజెర్సీలో 20వేల డాలర్లు ఆర్జించేవారిని 70వేల డాలర్లు ఆర్జించేవారితో పోల్చితే కారు మరమ్మత్తు బిల్లు చెల్లించడానికి పేద వర్గాలు ఎంతో ఆందోళన వ్యక్తంచేశాయి. భారత్‌లోని చెరకు రైతులు పంట వేయక ముందు పేదలుగా చేతికొచ్చాక ధనవంతులుగా భావించారు'' అని అధ్యయనంలో గుర్తించినట్లు జియెంగ్‌ పేర్కొన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Second language is good at older age,రెండోభాష... మలిదశలోనే మేలు!

  •  


  •  
టొరంటో : పిల్లలకు మాతృభాష కాకుండా రెండో భాషను శైశవదశలో కంటే మలిబాల్యదశలో నేర్పించడం మంచిదని కెనడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వారి మేధోశక్తిని పెంచుతుందని... ఇందుకు అనుగుణంగా వారి మెదడు నిర్మాణం కూడా మారుతుందని వివరిస్తున్నారు. కెనడా మాంట్రియల్‌లోని న్యూరోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్పిటల్‌, మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయంలోని ది న్యూరో, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. రెండు భాషలు నేర్చిన 66 మంది, ఒక్క భాష మాత్రమే తెలిసిన 22 మంది మెదడును ఎంఆర్‌ఐ స్కాన్‌ తీశారు. వాటిని విశ్లేషించేందుకు 'ది న్యూరో' సంస్థ రూపొందించిన సరికొత్త సాఫ్ట్‌వేర్‌ వాడారు. మొదట మాతృభాష నేర్చుకుని.. కొన్నేళ్ల తర్వాత ఇతర భాషలు నేర్చుకున్న పిల్లల మెదడులోని ఎడమపక్క ఇన్‌ఫీరియర్‌ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ దళసరిగా మారడం గమనించారట. కుడిపక్క కార్టెక్స్‌ పలుచనవడం చూశారట. ఇటువంటి 'నిర్మాణం' పిల్లల్లో ఒకేసారి విభిన్నపనులు చేయగల సామర్థ్యం పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

24 October 2013

Coffee reduce tendency for suicide,ఆత్మహత్యలకు 'కాఫీ' కళ్లెం



వాషింగ్టన్‌: రోజూ కాఫీ తాగితే ఆత్మహత్య ముప్పు సగానికి సగం తగ్గుతున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. కాఫీలోని కెఫీన్‌ మెదడులోని రసాయనాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు తెలిపారు. గతంలో జరిగిన మూడు పెద్ద అధ్యయనాలను తాజాగా సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తక్కువ కాఫీ తాగేవారితో, అసలే ఆ అలవాటులేని వారితో పోలిస్తే.. రోజుకి రెండు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగినవారికి ఆత్మహత్య ముప్పు 50% తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించటమే కాదు.. మెదడులో నాడీ సమాచారాన్ని చేరవేసే సెరటోనిన్‌, డొపమైన్‌ వంటి కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేయటం ద్వారా ఒక మాదిరి కుంగుబాటు నివారణిగానూ పనిచేస్తోందని పరిశోధకులు వివరించారు. కాఫీ తాగేవారికి కుంగుబాటు ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లో తేలిన సంగతిని ఇది విశ్లేషిస్తోందన్నారు. అయితే కుంగుబాటు బారినపడ్డవాళ్లు కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవాలనేది దీనర్థం కాదని పేర్కొన్నారు.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/