22 November 2013

Asprin taken night is good, ఆస్ప్రిన్‌ మాత్ర రాత్రిపూటే మేలు

  •  



 Asprin taken night is good, ఆస్ప్రిన్‌ మాత్ర రాత్రిపూటే మేలు

వాషింగ్టన్‌: గుండెజబ్బులు గలవారు ఉదయం పూట కన్నా రాత్రి నిద్రపోవటానికి ముందు ఆస్ప్రిన్‌ వేసుకోవటం మేలని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో గుండెపోటు ముప్పు తగ్గుతున్నట్టు తేలిందని వివరించారు. గుండెజబ్బు గలవారికి తక్కువ మోతాదులో ఆస్ప్రిన్‌ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది రక్తాన్ని పలుచబరుస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఆస్ప్రిన్‌ ఎప్పుడు వేసుకుంటే మేలనే దానిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. రాత్రిపూట ఆస్ప్రిన్‌ మాత్రలు వేసుకున్నవారి రక్తంలో ప్లేట్‌లెట్ల పనితీరు మందగించినట్టు గుర్తించినట్లు లీడెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన టోబియాస్‌ బోంటెన్‌ సూచించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Cautions before heart-attack,గుండెపోటుకు నెల ముందే హెచ్చరికలు

  •  

 Cautions before heart-attack,గుండెపోటుకు నెల ముందే హెచ్చరికలు

వాషింగ్టన్‌: హఠాత్తుగా గుండెపోటు (సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) సంభవించటానికి నెల ముందు నుంచే శరీరం హెచ్చరికలు అందజేస్తుందని పరిశోధకులు తెలిపారు. గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ విఫలం కావటం వల్ల గుండె పనిచేయటం ఆగిపోయి సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీస్తుంది. దీని బారినపడ్డ 53% మందిలో చాలాకాలం ముందు నుంచే ఛాతీనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. వీరిలో 56% మందిలో ఛాతీనొప్పి, 13% మందిలో శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, 4% మందిలో తలతిప్పు, వణుకు, గుండె వేగంగా కొట్టుకోవటం వంటివి ఉన్నట్టు కనుగొన్నారు. అందువల్ల ఛాతీనొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మేలని సీడర్‌-సినై హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సుమీత్‌ చుగ్‌ తెలిపారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

15 November 2013

More coffee lessen lifespan,అతి కాఫీ..ఆయుక్షీణం

  •  
  •  More coffee lessen lifespan,అతి కాఫీ..ఆయుక్షీణం

వాషింగ్టన్‌: రోజుకు నాలుగు కప్పులకు మించి కాఫీ తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. 55 ఏళ్లలోపు ఉన్నవారిలో రోజులో నాలుగు కంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగే వారి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. దక్షిణ కరోలినా విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో 25 నుంచి 87 ఏళ్లలోపు వయసున్న దాదాపు 40 వేల మందిని 1978 నుంచి 1998 మధ్య పరిశీలించారు. ఈ అధ్యయనంలో అలవాట్లను, జీవనశైలిని గురించి పరిశోధించారు. కాఫీ అధికంగా తాగే అలవాటున్న వారు ధూమపానం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని గుర్తించారు. దీనివల్ల వారి గుండె సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. పరిశోధన జరుగుతున్న సమయంలో 2512 మంది చనిపోయారు. అన్ని రకాల కారణాలతో కలిపి ఈ ముప్పు 56% ఉందని పరిశోధకులు తేల్చారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

13 November 2013

New medicine for dimentia,మందమతికో 'ఐన్‌స్టీన్‌' పరీక్ష



వాషింగ్టన్‌: వృద్ధాప్యంలో రాబోయే మతిమరుపు (డైమెన్షియా) జబ్బును ముందుగానే గుర్తించగలిగేందుకు 'ఐన్‌స్టిన్‌' అనే చిన్న పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని షికాగోకు చెందిన పరిశోధకులు అంటున్నారు. 40 నుంచి 65 ఏళ్ల ప్రాయంలో ఈ పరీక్ష ద్వారా ఈ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించవచ్చట. ఇందుకోసం వీరికి ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, ఓప్రా విన్‌ఫ్రే, ప్రిన్సెస్‌ డయాన, జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లాంటి 20 మంది ప్రముఖుల నలుపు తెలుపు చిత్రాలను ముద్రించి వారిని గుర్తించే పరీక్ష ఇది. 62ఏళ్ల ప్రాయంలో ఉన్నవారిపై ఈ పరీక్ష నిర్వహించి అధ్యయనం చేశారు. ఈ పరీక్ష కోసం మందమతి జబ్బు ఉన్నవారు ఆ చిత్రాల్లో ఉన్నవారి పేర్లు ఎంతమంది గుర్తు పడతారు, గుర్తు పట్టకపోతే, ఆ వ్యక్తులకు సంబంధించి వారికేం తెలుసో రాయమని చెప్పి పరిశీలించినట్లు షికాగోలోని నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ ఫీన్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకుడు టామర్‌ జెఫెన్‌ తెలిపారు. పేరు గుర్తించడంలో ఇబ్బంది పడ్డవారు ఎడమ టెంపోరల్‌ లోబ్‌లోని మెదడు కణజాలం కోల్పోయినట్లు, ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది పడ్డవారిలో ఈ మెదడు కణజాలం రెండువైపులా కోల్పోయినట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించామని, దీని ఆధారంగా ముందస్తుగానే ఈ జబ్బును కనుగొనగలమని తెలిపారు.=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Medicine to kill stomach cancer cells, జీర్ణాశయ క్యాన్సర్‌ కణాలను చంపే మందు



జీర్ణాశయ క్యాన్సర్‌ కణాలను సమర్థవంతంగా చంపే ఎల్‌ఎఫ్‌సిన్‌బీ25-ఆవు పాల నుంచి తీసిన ఎల్‌ఎఫ్‌సిన్‌బీ25 అనే పెప్త్టెడ్‌ జీర్ణాశయ క్యాన్సర్‌ కణాలను సమర్థవంతంగా చంపుతున్నట్టు తైవాన్‌ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Eye fore-telling paralysis, పక్షవాతాన్ని పట్టిచ్చే కంటిపాప



వాషింగ్టన్‌ : అధిక రక్తపోటు వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువని చెబుతుంటారు. అయితే ప్రతి రక్తపోటూ పక్షవాతానికి దారితీయకపోవచ్చు. కొన్నిరకాల అధిక రక్తపోటుకు మాత్రమే ఆ ప్రమాదం. ముఖ్యంగా కంట్లో 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి' వంటి సమస్యలు కలిగించే రక్తపోటుతో ఈ ప్రమాదం ఎక్కువని చెబుతున్నారు సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు మొహమ్మద్‌ కమ్రాన్‌ ఇక్రామ్‌. అందుకు కంటిపాపను ముందుగానే ఛాయాచిత్రం తీయడం ఎంతగానో ఉపయోగపడుతుందనిఆయన అంటున్నారు. కంటిపాపలోని రెటినా మెదడులోని నరాల ఆరోగ్యాన్ని ఇట్టే పట్టిచ్చేస్తుందని ఆయన చెబుతున్నారు. కమ్రాన్‌ ఇక్రామ్‌ 13 ఏళ్లపాటు 2,907 మంది రోగులపై పరిశోధన చేశారు. ముందుగా వారి కంటిపాపలోని రెటినా ఛాయాచిత్రాలు తీసుకున్నారు. ఛాయాచిత్రాల ద్వారా 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి'ని పసిగట్టిన రోగుల్లో పక్షవాతం వచ్చే ప్రమాదం 35 నుంచి 137 శాతం వరకు నమోదైందని ఇక్రామ్‌ చెబుతున్నారు.=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

App.to break heart stroke, యాప్‌తో స్ట్రోక్‌కి బ్రేక్‌



మెల్బోర్న్‌: హృదయ స్పందనలో తేడాలను సకాలంలో గుర్తించి.. స్ట్రోక్‌ రాకుండా కాపాడే యాప్‌ను అభివృద్ధి చేశారు సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అలివ్‌కార్‌ హార్ట్‌ మానిటర్‌ పేరిట పిలిచే ఈ ఐఫోన్‌ యాప్‌ ఆట్రియల్‌(Atrial fibrillation) ఫిబ్రిల్లేషన్‌ (ఏఎఫ్‌)ను గుర్తిస్తుంది. దీనికి చికిత్స తీసుకుంటే స్ట్రోక్‌ రాకుండా జాగ్రత్తపడొచ్చు. ఏఎఫ్‌ అనేది వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్య. ఈ సమస్య కలిగిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/