19 November 2014

Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

  •  

  • Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది పిల్లల్లో ఎక్కువ. ఒళ్లంతా ఎర్రటి దద్దు, దురదతో బాధపెట్టే ఈ సమస్య చలికాలంలో మరింత ఉద్ధృతం అవుతుంటుంది కూడా. ఇలాంటి పిల్లలకు విటమిన్‌ డి మేలు చేస్తున్నట్టు, ఎగ్జిమా లక్షణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు తాజాగా బయట పడింది. సాధారణంగా అటోపిక్‌ డెర్మటైటిస్‌కు అల్ట్రావయొలెట్‌ (యూవీ) కాంతి చికిత్స కూడా చేస్తుంటారు. ఇది చర్మంలో విటమిన్‌ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చలికాలంలో ఎగ్జిమా ఉద్ధృతం కావటానికీ విటమిన్‌ డి లోపానికీ సంబంధం ఉండొచ్చనే అనుమానంతో పరిశోధకులు ఇటీవల మంగోలియాలో ఒక అధ్యయనం చేశారు. ఆ దేశంలో పిల్లల్లో విటమిన్‌ డి లోపం అధికం. కాబట్టి అటోపిక్‌ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న 2-17 ఏళ్ల పిల్లలను ఎంచుకొని.. వీరిలో కొందరికి రోజుకి 1,000 ఐయూ మోతాదులో విటమిన్‌ డి మాత్రలను, మరికొందరికి ఎలాంటి మందులేని మాత్రలను (ప్లాసిబో) ఇచ్చారు. నెల తర్వాత పరిశీలించగా.. విటమిన్‌ డి మాత్రలను వేసుకున్నవారిలో 29% మందిలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు మెరుగుపడినట్టు తేలింది. అందువల్ల పిల్లల్లో చలికాలంలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు తీవ్రమవుతుంటే కొన్ని వారాల పాటు విటమిన్‌ డి మాత్రలను ఇచ్చి చూసి, ఫలితాలు బాగుంటే మరికొంత కాలం కొనసాగించటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.