19 November 2014

వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

  •  

  • వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

గర్భధారణకు ప్రయత్నిస్తున్నారా? అయితే వేపుళ్లను తినకుండా చూసుకోండి. ఇలాంటి తిండితో గర్భిణి మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) ముప్పు పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణకు ముందు అధికంగా తిన్న మహిళలకు గర్భిణి మధుమేహం ముప్పు 13 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది మరి. వారానికి 4-6 సార్లు వేపుళ్లను తినేవారికి ఈ ముప్పు 31% అధికంగా ఉంటుండగా.. 7, అంతకన్నా ఎక్కువసార్లు తినేవారికైతే రెండింతలు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని (బాడీమాస్‌ ఇండెక్స్‌) పరిగణనలోకి తీసుకొని చూసినా వేపుళ్లను తినేవారికి గర్భిణి మధుమేహం వచ్చే అవకాశం అధికంగానే ఉంటోందని.. ఇలాంటి ఆహారాన్ని ఇంట్లో వండుకొని తినేవారి కన్నా హోటళ్లలో తినేవారికి ముప్పు మరింత పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. వేపుళ్లు తినటాన్ని అదుపు చేస్తే జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ముప్పు తగ్గటానికి తోడ్పడగలదని సూచిస్తున్నారు. కాబట్టి వేపుళ్ల విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండటం మంచిది.

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.