19 July 2013

Long live with fish eating,చేపల ఆహారం తో దీర్ఘాయుష్షు


  •  


  •  
ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే తరచుగా చేపలను తిని చూడండి. ఎందుకంటే వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆయుష్షు పెరగటానికి దోహదం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా గలవారితో పోలిస్తే అధికంగా ఉన్నవారు రెండేళ్లకు పైగా ఎక్కువగా జీవిస్తున్నట్టు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగని చేపనూనె మాత్రలు వేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆహారం ద్వారా లభించ ఒమేగా-3 కొవ్వులతోనే ఈ ప్రయోజనం కనబడుతోందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ దారియష్‌ మొజఫరేయన్‌ చెబుతున్నారు. రక్తంలోని ఒమేగా-3 స్థాయులకూ మరణం ముప్పు.. ముఖ్యంగా గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటోదంటున్నారు. ఈ కొవ్వులు అధికంగా గలవారిలో ఏ కారణంతోనైనా వచ్చే మరణాల ముప్పు 27% తక్కువగా ఉంటుండగా.. గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు 35% తక్కువగా ఉంటోందని తేలింది. చేపల్లో గుండెకు మేలు చేసే ప్రోటీన్‌, కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. చేపలు అధికంగా గల ఆహారం తీసుకుంటే గుండెజబ్బు మూలంగా వచ్చే మరణం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ తేలింది. అయితే ఇతర కారణాలతో వచ్చే మరణాలపై వీటి ప్రభావం గురించి స్పష్టత లేదు. అందుకే మొజఫరేయన్‌ బృందం ఈ దిశగానూ అధ్యయనం చేసింది. వ్యక్తులు చెప్పే అంశాలపై కాకుండా నిజంగా రక్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల స్థాయులను లెక్కించి మరీ 16 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. అయితే మరణాల ముప్పు తగ్గటానికీ ఒమేగా-3 కొవ్వులకు నేరుగా సంబంధం ఉంటోందా? లేకపోతే ఇది ఆరోగ్యకర జీవనశైలికిది సూచికా? అన్నది మాత్రం నిర్ధరణ కాలేదు. ఎందుకంటే అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఒమేగా కొవ్వులు ఎక్కువగా గలవారు పండ్లు, కూరగాయల వంటివీ బాగానే తీసుకునేవారు. అందువల్ల కేవలం చేపనూనె మాత్రలు తీసుకుంటే సరిపోతుందని భావించటం తప్పని, వాటితో ఇలాంటి ఫలితాలే కనబడతాయని చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా 100 గ్రాముల చొప్పున వారానికి రెండుసార్లు చేపలను తినాలన్నది నిపుణుల సూచన.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.