11 July 2013

Neem leaves for cancer treatment,క్యాన్సర్‌ పై వేప ప్రభావము

  •  


కణితి కణాల వృద్ధిని అడ్డుకునే ప్రోటీన్‌ గుర్తింపు---భారతీయ శాస్త్రవేత్తల ఘనత

కోల్‌కతా: వేపలోని ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. ఇది క్రిమి, కీటక సంహారిణిగానే కాదు.. క్యాన్సర్‌తోనూ పోరాడగలదని మీకు తెలుసా? వేప ఆకుల నుంచి తీసిన ీనీమ్‌ లీఫ్‌ గ్త్లెకోప్రోటీన్‌- ఎన్‌ఎల్‌జీపీ' అనే ప్రోటీన్‌.. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తాజాగా బయటపడింది. చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎన్‌సీఐ)కు చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని గుర్తించింది. ఈ ప్రోటీన్‌ నేరుగా క్యాన్సర్‌ కణాలను లక్ష్యంగా చేసుకోవటం కన్నా కణితిలోని రోగ నిరోధక కణాలను బలోపేతం చేస్తుండటం విశేషం. అలాగే కణితి చుట్టుపక్కల గల రక్తం వంటి ఇతర వ్యవస్థలనూ మారుస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలా అది క్యాన్సర్‌ కణాలు బలహీనమయ్యేలా చేస్తుందన్నమాట. కణితి సూక్ష్మవాతావరణం(టీఎంఈ)లో రోగనిరోధక కణాలతో పాటు వివిధ రకాల కణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ కణాల వృద్ధికి తోడ్పడే కారకాలూ ఉంటాయి. అయితే ఎన్‌ఎల్‌జీపీ.. క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే టీ కణాలు బాగా వృద్ధి చెందేలా కణితి లోపల, చుట్టూ ఉండే సూక్ష్మ వాతావరణాన్ని మారుస్తున్నట్టు తేలింది. ఇలా అది కణితి పెరుగుదలను అడ్డుకుంటున్నట్టు గుర్తించారు. ీుఎలుకలపై చేసిన అధ్యయనంలో ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఎలాంటి పెద్ద దుష్ప్రభావాలు లేకుండానే ఎన్‌ఎల్‌జీపీ క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తేలింది'' అని సీఎన్‌సీఐకి చెందిన రతీంద్రనాథ్‌ బరాల్‌ తెలిపారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.