01 September 2013

IncreaseLongivity on stoping smoking,పొగమానేస్తే దీర్ఘాయుష్షు

  •  


  •  
పొగ తాగేవారికి జబ్బుల ముప్పు ఎక్కువ. ముఖ్యంగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం మరీ అధికం. దీంతో ఆయుష్షు కూడా తగ్గుతుంది. అయితే మంచి విషయం ఏటంటే.. పొగ అలవాటును ఎప్పుడు మానేస్తే అప్పట్నుంచే దాని దుష్ప్రభావాలు తగ్గటం మొదలవుతాయి. గుండెజబ్బులు గలవారిపై ఇటీవల చేసిన అధ్యయనంలోనూ ఇది మరోసారి బయటపడింది. బెలూన్‌ యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత సిగరెట్లు తాగటం మానేసినవారిలో గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతోందని, ఫలితంగా రెండేళ్ల పాటు ఎక్కువగా బతుకుతున్నారని పరిశోధకులు గుర్తించారు. సగటున 50 ఏళ్ల వయసులో యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. యాంజియోప్లాస్టీ అనంతరం ఏడాదిలోపు పొగ అలవాటు మానేసినవారు 18.5 ఏళ్ల పాటు జీవించగా.. పొగ మాననివారు 16.4 సంవత్సరాలు మాత్రమే జీవించినట్టు తేలింది. చాలామంది యువకులుగా ఉన్నప్పుడే పొగ అలవాటును ప్రారంభిస్తుంటారు. అది అలా అలా కొనసాగుతూనే వస్తుంది. మధ్యవయసులో మానేయమంటే 'ఇక ఇప్పుడేం మానేస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది' అని అంటుంటారు. కానీ పొగ ఎప్పుడు మానేసినా మంచి ఫలితాలే కనబడతాయనటానికి తాజా అధ్యయనమే నిదర్శనమని నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుడు రాన్‌ వ్యాన్‌ డాంబర్గ్‌ అంటున్నారు. ''మీ కోసం కాకపోయినా.. మీ మనవలు, మనవరాళ్ల కోసమైనా పొగ మానెయ్యండి. వాళ్లు మరో రెండేళ్లు అదనంగా తాతయ్యతో ఆనందంగా ఆడుకునే అవకాశం కల్పించినవారవుతారు'' అని సూచిస్తున్నారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.