01 September 2013

perfluorinated chemicals bad to Thyroid,థైరాయిడ్‌కు పర్‌ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌ ముప్పు

  •  




గొంతు ముందుభాగాన సీతాకోకచిలుక ఆకారంలో కరచుకొని ఉండే థైరాయిడ్‌ గ్రంథి స్రవించే థైరాక్సిన్‌ హార్మోన్‌ శరీరానికి ఎంతో అవసరం. ఇది శరీర ఎదుగుదలకు తోడ్పడటం దగ్గర్నుంచి గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచటం వరకు చాలా పనులు చేస్తుంది. కణాల్లో శక్తి విడుదలయ్యే ప్రక్రియలోనూ పాలు పంచుకుంటుంది. అయితే ఇంతటి కీలకమైన థైరాయిడ్‌ గ్రంథికి మనం రోజూ వాడే కొన్ని వస్తువుల్లోని పర్‌ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌ (పీఎఫ్‌సీ) హాని చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. వస్త్రాలు, తివాచీలు, సౌందర్య సాధనాలు, కాగితాలపై పూసే పొరల తయారీలో ఈ పీఎఫ్‌సీలను ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలోకి చేరుకుంటే ఒకపట్టాన జీర్ణం కావు. లోపల చాలాకాలం నిల్వ ఉండిపోతాయి. రక్తంలో పీఎఫ్‌సీల మోతాదులు ఎక్కువగా గలవారిలో థైరాయిడ్‌ పనితీరు దెబ్బతింటున్నట్టు తాజాగా బయటపడింది. ముఖ్యంగా వీటి మూలంగా మహిళల్లో థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుండటం (హైపోథైరాయిడిజమ్‌) గమనార్హం. దీని మూలంగా నిస్సత్తువ, మానసిక కుంగుబాటు, బరువు పెరగటం, చర్మంతో పాటు వెంట్రుకలు పొడిబారటం, ఒళ్లు చల్లగా ఉన్నట్టు అనిపించటం, మలబద్ధకం, నెలసరి అస్తవ్యస్తం కావటం వంటి లక్షణాలు కనబడతాయి. రక్తంలో పీఎఫ్‌సీల మోతాదులకు థైరాయిడ్‌ పనితీరుకు మధ్య సంబంధం ఉంటున్నట్టు తేలటం ఇదే తొలిసారని సహ అధ్యయనకర్త డాక్టర్‌ చీన్‌-యు లిన్‌ పేర్కొంటున్నారు. ఈ పీఎఫ్‌సీలు దీర్ఘకాలం శరీరంలో ఉండిపోతాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని సూచిస్తున్నారు
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.