28 January 2014

Low blood glucose improve and increase memory,గ్లూకోజ్‌ తగ్గితే పెరిగే జ్ఞాపకశక్తి

  •  
  •  

బెర్లిన్‌: రక్తంలో గ్లూకోజ్‌ తక్కువగా ఉండేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. మధుమేహం లేకపోయినా రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా.. సగటున 63 ఏళ్ల వయసులో ఉన్న 141 మంది జ్ఞాపకశక్తి నైపుణ్యాలను, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను పరిశీలించారు. జ్ఞాపకశక్తి విషయంలో కీలకంగా వ్యవహరించే మెదడులోని హిపోక్యాంపస్‌ పరిమాణాన్ని తెలుసుకునేందుకు స్కానింగ్‌ చేశారు. రక్తంలో తక్కువ గ్లూకోజ్‌ ఉన్నవారు జ్ఞాపకశక్తి పరీక్షలో మంచి నైపుణ్యం ప్రదర్శించినట్లు తేలింది. అధిక గ్లూకోజ్‌ ఉండేవారు తక్కువ పదాలను జ్ఞాపకం ఉంచుకున్నట్లు గుర్తించారు. రక్తంలో గ్లూకోజ్‌ సాధారణ స్థితిలో ఉన్నవారూ, చక్కెర స్థాయిని తగ్గించుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యల్ని తగ్గించుకోవచ్చనీ, వయసు పెరుగుతున్న కొద్దీ కాగ్నిటివ్‌ సామర్థ్యం తగ్గడాన్ని నివారించుకోవచ్చని బెర్లిన్‌లోని వైద్య విశ్వవిద్యాలయ పరిశోధకులు యాగ్నెస్‌ ఫ్లోయెల్‌ పేర్కొన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.