14 January 2014

Uterus transplantation,గర్భాశయం మార్పిడి




9 మంది గర్భసంచి మార్పిడి
స్టాక్‌హోం: స్వీడన్‌ వైద్యులు.. 9 మంది మహిళలకు గర్భాశయాన్ని అమర్చారు. బంధువుల నుంచి సేకరించి, వీరి శరీరంలోకి ప్రవేశపెట్టారు. గర్భం దాల్చేందుకు కూడా వారు ప్రయత్నిస్తారని ప్రాజెక్టులో పాలుపంచుకున్న వైద్యులు తెలిపారు. మహిళల్లో గర్భాశయ మార్పిడి సాధ్యమేనా అన్నది పరిశీలించేందుకు దీన్ని చేపట్టారు. ఈ మహిళలు గర్భాశయం లేకుండా జన్మించడమో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కారణంగా వాటిని తొలగించడమో జరిగింది. వీరంతా 30లలో ఉన్నారు. ప్రాణాధారమైన గుండె, కాలేయం, మూత్రపిండాల మార్పిడిని వైద్యులు కొన్ని దశాబ్దాలుగా చేపడుతున్నారు. ఇప్పుడు రోగి చేతులు, ముఖం, ఇతర భాగాల మార్పిడి కూడా జరుగుతోంది. గర్భాశయ మార్పిడి మాత్రం విజయవంతం కాలేదు. లోగడ టర్కీ, సౌదీ అరేబియాల్లో ప్రయోగాలు జరిగాయి. అయితే ప్రయోగార్థులకు సంతానప్రాప్తి కలగలేదు. బ్రిటన్‌, హంగేరి, అమెరికాల్లో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి కన్నా అత్యాధునిక పద్ధతిలో స్వీడన్‌ పరిశోధకులు ఆపరేషన్‌ చేపట్టారు. గోథెన్‌బర్గ్‌ వర్సిటీకిచెందిన మాట్స్‌ బ్రాన్‌స్ట్రామ్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం దీన్ని నిర్వహించింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.