03 January 2014

TV effect on Sperm,వీర్యంపై టీవీ ప్రభావం

  •  
  •  

శారీరక శ్రమ లేకపోవటం, చాలాసేపు టీవీ చూడటం వల్ల వీర్యం చిక్కదనం, వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌కు చెందిన ఆడ్రే గాస్కిన్స్‌ చాలాకాలంగా వీర్యంపై ఆహారం, వ్యాయామం చూపే ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. శారీరక శ్రమ మూలంగా ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ (విశృంఖల కణాలను తొలగించుకునే సమయంలో శరీరంపై పడే ఒత్తిడి) తగ్గుతున్నట్టు.. ఇది వీర్య కణాల రక్షణకు తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా ఆమె యువకులపై తాజాగా అధ్యయనం చేశారు. వారానికి 15 గంటల పాటు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామం చేసినవారిలో వీర్యం చిక్కదనం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అలాగే టీవీ చూడని వారితో పోలిస్తే వారానికి 20 గంటల పాటు టీవీ ముందు గడిపే యువకుల్లో వీర్యకణాల సంఖ్య సుమారు సగం వరకు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వీర్యకణాల చురుకుదనం, వాటి ఆకారం విషయంలో మాత్రం మార్పులేవీ కనబడలేదని వివరిస్తున్నారు. కేవలం ఈ ఫలితాల ఆధారంగా వ్యాయామంతో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఇతరత్రా లాభాలు చాలా ఉంటాయి కాబట్టి వేగంగా నడవటం, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటివి చేయటం మంచిదని సూచిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.