13 November 2013

Eye fore-telling paralysis, పక్షవాతాన్ని పట్టిచ్చే కంటిపాప



వాషింగ్టన్‌ : అధిక రక్తపోటు వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువని చెబుతుంటారు. అయితే ప్రతి రక్తపోటూ పక్షవాతానికి దారితీయకపోవచ్చు. కొన్నిరకాల అధిక రక్తపోటుకు మాత్రమే ఆ ప్రమాదం. ముఖ్యంగా కంట్లో 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి' వంటి సమస్యలు కలిగించే రక్తపోటుతో ఈ ప్రమాదం ఎక్కువని చెబుతున్నారు సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు మొహమ్మద్‌ కమ్రాన్‌ ఇక్రామ్‌. అందుకు కంటిపాపను ముందుగానే ఛాయాచిత్రం తీయడం ఎంతగానో ఉపయోగపడుతుందనిఆయన అంటున్నారు. కంటిపాపలోని రెటినా మెదడులోని నరాల ఆరోగ్యాన్ని ఇట్టే పట్టిచ్చేస్తుందని ఆయన చెబుతున్నారు. కమ్రాన్‌ ఇక్రామ్‌ 13 ఏళ్లపాటు 2,907 మంది రోగులపై పరిశోధన చేశారు. ముందుగా వారి కంటిపాపలోని రెటినా ఛాయాచిత్రాలు తీసుకున్నారు. ఛాయాచిత్రాల ద్వారా 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి'ని పసిగట్టిన రోగుల్లో పక్షవాతం వచ్చే ప్రమాదం 35 నుంచి 137 శాతం వరకు నమోదైందని ఇక్రామ్‌ చెబుతున్నారు.=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.