07 November 2013

Second language is good at older age,రెండోభాష... మలిదశలోనే మేలు!

  •  


  •  
టొరంటో : పిల్లలకు మాతృభాష కాకుండా రెండో భాషను శైశవదశలో కంటే మలిబాల్యదశలో నేర్పించడం మంచిదని కెనడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వారి మేధోశక్తిని పెంచుతుందని... ఇందుకు అనుగుణంగా వారి మెదడు నిర్మాణం కూడా మారుతుందని వివరిస్తున్నారు. కెనడా మాంట్రియల్‌లోని న్యూరోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్పిటల్‌, మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయంలోని ది న్యూరో, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. రెండు భాషలు నేర్చిన 66 మంది, ఒక్క భాష మాత్రమే తెలిసిన 22 మంది మెదడును ఎంఆర్‌ఐ స్కాన్‌ తీశారు. వాటిని విశ్లేషించేందుకు 'ది న్యూరో' సంస్థ రూపొందించిన సరికొత్త సాఫ్ట్‌వేర్‌ వాడారు. మొదట మాతృభాష నేర్చుకుని.. కొన్నేళ్ల తర్వాత ఇతర భాషలు నేర్చుకున్న పిల్లల మెదడులోని ఎడమపక్క ఇన్‌ఫీరియర్‌ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ దళసరిగా మారడం గమనించారట. కుడిపక్క కార్టెక్స్‌ పలుచనవడం చూశారట. ఇటువంటి 'నిర్మాణం' పిల్లల్లో ఒకేసారి విభిన్నపనులు చేయగల సామర్థ్యం పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.