24 October 2013

Coffee reduce tendency for suicide,ఆత్మహత్యలకు 'కాఫీ' కళ్లెం



వాషింగ్టన్‌: రోజూ కాఫీ తాగితే ఆత్మహత్య ముప్పు సగానికి సగం తగ్గుతున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. కాఫీలోని కెఫీన్‌ మెదడులోని రసాయనాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు తెలిపారు. గతంలో జరిగిన మూడు పెద్ద అధ్యయనాలను తాజాగా సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తక్కువ కాఫీ తాగేవారితో, అసలే ఆ అలవాటులేని వారితో పోలిస్తే.. రోజుకి రెండు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగినవారికి ఆత్మహత్య ముప్పు 50% తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించటమే కాదు.. మెదడులో నాడీ సమాచారాన్ని చేరవేసే సెరటోనిన్‌, డొపమైన్‌ వంటి కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేయటం ద్వారా ఒక మాదిరి కుంగుబాటు నివారణిగానూ పనిచేస్తోందని పరిశోధకులు వివరించారు. కాఫీ తాగేవారికి కుంగుబాటు ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లో తేలిన సంగతిని ఇది విశ్లేషిస్తోందన్నారు. అయితే కుంగుబాటు బారినపడ్డవాళ్లు కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవాలనేది దీనర్థం కాదని పేర్కొన్నారు.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.