04 October 2013

New vaccine to reduce cholesterol,కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొత్త టీకా


  •  
లండన్‌: కొలెస్ట్రాల్‌ను సగందాకా తగ్గించి వేసే కొత్తరకం టీకాను అందుబాటులోకి రానుంది. ప్రాణాంతక కొలెస్ట్రాల్‌ను 57 శాతందాకా తగ్గించే ఈ టీకాను రోగులపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. స్టాటిన్‌ మందులతో నిరోధకత ఉండే రోగులకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. హానికారక కొలెస్ట్రాల్‌గా వ్యవహరించే 'లోడెన్సిటీ లిపోప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌)'ను లక్ష్యంగా చేసుకునే ఈ పద్ధతితో అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే రోగులకు కొత్త తరహా చికిత్స అందుబాటులోకి రానుందని పరిశోధకులు పేర్కొన్నారు. 'ఏఎల్‌ఎన్‌-పీసీఎస్‌'గా పిలిచే ఔషధం కొలెస్ట్రాల్‌ను నియంత్రించే 'పీసీఎస్‌కే9' అనే ప్రొటీన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. రక్తంలోని హానికారక కొలెస్ట్రాల్‌ను తొలగించే రిసెప్టర్లను ఈ ప్రొటీన్‌ దెబ్బతీస్తుంది. ఈ కొత్త విధానంతో చికిత్సపై ఆశలు చిగురిస్తున్నాయని బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ వైద్య సంచాలకులు ప్రొఫెసర్‌ పీటర్‌ వీస్‌బెర్గ్‌ పేర్కొన్నారు.(10:37 AM 04-Oct-13)
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.