24 October 2013

Breast feeding prevent mother from depression,పిల్లలకు పాలిస్తే తల్లుల్లో కుంగుబాటు దూరం

  •  


  •  
లండన్‌: పిల్లలకు పాలివ్వటం తల్లులకూ మేలు చేస్తుందని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నదే. ఇప్పుడు దీని గురించి మరో కొత్త సంగతి బయటపడింది. పిల్లలకు పాలివ్వటం వల్ల తల్లుల మెదడులో విటమిన్‌ ఏ పోగుపడటం ఆగుతుందని, ఫలితంగా వీరికి కుంగుబాటు ముప్పూ తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు విటమిన్‌ ఏ అందుతుందని జాక్సన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. లేకపోతే బాలింతల మెదళ్లలో విటమిన్‌ ఏ పేరుకొని కుంగుబాటును ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. పిల్లల ఎదుగదలకు విటమిన్‌ ఏ ఎంతో అవసరం. అందువల్ల ఇది గర్భిణుల్లో పెద్ద మోతాదుల్లో నిల్వ ఉంటుంది. ఒకవేళ కాన్పు తర్వాత తొలినాళ్లలో తల్లులు శిశువులకు పోతపాలు పడితే కుంగుబాటుకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరించారు. సుమారు 80% మంది బాలింతలు స్వల్ప కుంగుబాటు బారినపడే అవకాశముంది. ఇందుకు హార్మోన్ల మార్పులు దోహదం చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కుంగుబాటు బారినపడటం, వేధింపులు లేదా మానసిక అస్వస్థత, పొగ తాగటం, మద్యం అలవాటు వంటివీ దీనికి తోడ్పడతాయి.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.