19 October 2013

Increase in Lifespan with walking,నడకతో ఆయుష్షు పెరుగుదల

  •  



  •  
నడక మంచి వ్యాయామనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది రక్తపోటు, గ్లూకోజు నియంత్రణలో ఉండటానికే కాదు.. ఆయుష్షు పెరగటానికీ తోడ్పడుతుందని మీకు తెలుసా? రోజుకి కేవలం 15 నిమిషాలు నడిచినా మంచి ఫలితం కనబడుతున్నట్టు, వీరికి క్యాన్సర్‌తో మరణం సంభవించే ముప్పు 10% తగ్గుతున్నట్టు బయటపడింది. అంతేకాదు.. ఎలాంటి కారణంతో వచ్చే మరణం ముప్పైనా 14% తగ్గుతున్నట్టు, జీవనకాలం మూడేళ్లు పెరుగుతున్నట్టు తేలింది. తైవాన్‌లో 4 లక్షలకు పైగా ప్రజలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఎక్కువ ప్రయోజనం కనబడుతోంది కూడా. ప్రతి 15 నిమిషాల అదనపు నడకతో (అంటే 15 నిమిషాలు నడిచేవారు 30 నిమిషాలు నడిస్తే) క్యాన్సర్‌తో వచ్చే మరణం ముప్పు మరో 1% ఎక్కువగా తగ్గుతుండగా.. ఇతర అన్ని కారణాలతో సంభవించే మరణం ముప్పు 4% అధికంగా తగ్గుతోంది. ఈ నడక ప్రయోజనాలు అన్ని వయసుల వారిలోనూ ఒకే విధంగా కనబడుతుండటం విశేషం. ఇక రోజుకి సగటున 6 గంటల పాటు టీవీ చూసేవారిలో జీవనకాలం ఐదేళ్లు పడిపోతున్నట్టు బ్రిటన్‌లో చేసిన మరో అధ్యయనంలో బయటపడింది. 25 ఏళ్లు పైబడినవారిలో టీవీ చూస్తూ గడుపుతున్న ప్రతి గంట కాలానికీ సుమారు 22 నిమిషాల ఆయుష్షు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. టీవీ చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు రెండు సిగరెట్లను కాల్చటంతో వాటిల్లే అనర్థాలతో సమానంగా ఉంటుండటం గమనార్హం.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.