20 October 2013

parents obesity inherit to children,తండ్రుల వూబకాయం పిల్లలకు






మెల్‌బోర్న్‌: తండ్రి వూబకాయుడైతే.. వారి పిల్లలకూ అధిక బరువు ముప్పు పొంచి ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో గుర్తించారు. స్థూలకాయుడైన తండ్రి శుక్రకణాల్లోని పరమాణు సంకేతాలు.. సంతానంలో రెండు తరాల వరకూ మధుమేహం తరహా లక్షణాలనూ, స్థూలకాయాన్నీ కలిగిస్తున్నట్లు అడిలైడ్‌ విశ్వవిద్యాలయం బృందం పరిశోధనలో వెల్లడైంది. చిన్నారులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఇలాంటి సమస్య తప్పటం లేదని గుర్తించారు. ఇలాంటి లంకెను గుర్తించడం తొలిసారి అని పరిశోధకులు టాడ్‌ ఫుల్‌స్టాన్‌ పేర్కొన్నారు. తండ్రి ఆహార అలవాట్లు వీర్యంలోని మాలిక్యులర్‌ మేకప్‌లో మార్పులకు దారితీస్తున్నట్లు వివరించారు. వూబకాయం కారణంగా.. తండ్రుల వీర్యం, మైక్రోఆర్‌ఎన్‌ఏ పరమాణువుల్లో మార్పులు తలెత్తడం వల్ల స్థూలకాయం దిశగా పిండంలోనే మార్పులు సంభవించడంగానీ లేదా జీవిత అనంతర కాలంలో జీవక్రియ వ్యాధికి కారణంగానీ కావచ్చని ఫుల్‌స్టాన్‌ వివరించారు. తండ్రికి మధుమేహం లేకపోయినా, తర్వాతి రెండు తరాలకు సంక్రమించే లక్షణం ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతానికి ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామనీ, తర్వాతి దశలో మనుషులపైనా పరిశీలిస్తామని చెప్పారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.