12 October 2013

exercise protects brain,మెదడుకు వ్యాయామ రక్ష

  •  

వాషింగ్టన్‌: వ్యాయామంతో శరీర దారుఢ్యమే కాదు.. మేధోశక్తి కూడా పెరుగుతుందని మీకు తెలుసా? డానా-ఫార్బర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులో ఉత్పత్తయ్యే ఎఫ్‌ఎన్‌డీసీ5 అనే అణువు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే జ్ఞాపకశక్తి, విషయగ్రహణలో పాలు పంచుకునే జన్యువులను ప్రేరేపించే ఐరిసిన్‌ ప్రోటీన్‌ స్థాయులు కూడా వ్యాయామం మూలంగా పెరుగుతున్నట్టు కనుగొన్నారు. నాడీ సంబంధ వ్యాధుల చికిత్సకు, వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరచేందుకు మందులను రూపొందించటంలో ఇవి ఉపయోగపడగలవని భావిస్తున్నారు. విషయగ్రహణ శక్తిని వ్యాయామం పెంపొందించగలదని.. పక్షవాతం, కుంగుబాటు, అల్జీమర్స్‌ వంటి జబ్బుల లక్షణాలను తగ్గించగలదని తేలినప్పటికీ ఇదెలా జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా తెలియదు. అయితే ఇందులో బీడీఎన్‌ఎఫ్‌ అనే వృద్ధి కారకం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. వ్యాయామం చేయటం వల్ల మెదడులో ఎఫ్‌ఎన్‌డీసీ5, ఐరిసిన్‌ ఉత్పత్తితో పాటు బీడీఎన్‌ఎఫ్‌ వృద్ధి కారకం వ్యక్తీకరణ కూడా పెరిగినట్టు తేలింది.--PM 06:59 12-10-2013
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.