24 October 2013

Device to detect disolved fat,కరిగే కొవ్వును తెలిపే పరికరం

  •  







  •  
టోక్యో: ఫిట్‌నెస్‌ కోసం తీవ్రంగా శ్రమించేవారు.. ఎప్పటికప్పుడు ఫలితాన్ని తెలుసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. బరువు కొలిచే యంత్రాలతో అవసరం లేకుండానే ఈ పని చేయొచ్చు. శరీరంలో ఎంతమేర కొవ్వు కరిగిందనేది అప్పటికప్పుడు తక్షణమే వెల్లడించే కొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. జేబులో పట్టేంత పరిమాణంలో ఉండే ఈ ప్రత్యేక పరికరాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. ఇందులో ఉండే సెన్సర్‌ ఒక వ్యక్తి వ్యాయామం సందర్భంగా ఎంతమేర కొవ్వును కరిగించాడనేది గుర్తిస్తుందని పేర్కొన్నారు. శ్వాసలో వెలువడే అసిటోన్‌ స్థాయులను కొలవడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. కొవ్వు కరిగినప్పుడు రక్తంలో అసిటోన్‌ ఉత్పత్తి జరుగుతుంది. అది ఊపిరితిత్తుల్లో సూక్ష్మతిత్తుల గుండా విడుదలవుతుంది. శ్వాస వదిలినప్పుడు బయటికి వస్తుంది. ఎన్‌టీటీ డొకోమో రీసెర్చి ల్యాబరేటరీస్‌కు చెందిన పరిశోధకులు ఈ పరికరాన్ని రూపొందించారు. నిశ్వాసను గుర్తించేందుకు ఇందులో ఒత్తిడి సెన్సర్‌ ఉంటుంది. అసిటోన్‌ను గుర్తించేందుకు రెండు రకాల సెమీకండక్టర్‌ ఆధారిత గ్యాస్‌ సెన్సర్లు ఉంటాయి. ఒక వ్యక్తి శ్వాస వదలగానే పరికరం అసిటోన్‌ గాఢత స్థాయులను లెక్కించి 10 క్షణాల్లో స్మార్ట్‌ఫోన్‌కు వివరాలను పంపుతుంది.(6:48 PM 24-Oct-13)
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.