24 October 2013

Low cost Tea bad for health,చవకగా దొరికే తేనీరుతో ఆర్యోగానికి చేటు

  •  



లండన్‌: ఉల్లాసం కోసం తాగే తేనీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవు. చవకగా దొరికే తేనీటితో ఎముకలు, దంతాల సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. సూపర్‌ మార్కెట్టులో వివిధ బ్రాండ్‌ పేర్లతో లభించే తేనీటి మిశ్రమ పదార్థాలలో ఫ్లోరైడ్‌ ఉండి వాటిని ఎక్కువ మొత్తంలో వాడితే దంతాలు, ఎముకల సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. సూపర్‌ మార్కెట్టులలో లభించే 38 రకాల తేనీటి మిశ్రమాలను, అమెరికాకు చెందిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(ఎన్‌ఏఎస్‌)కు సంబంధించిన ఆహార నమూనాను ఆధారంగా తీసుకుని ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన వ్యక్తి అరాధన మెహ్ర కూడ పాలుపంచుకున్నారు. తేనీరు, డ్రై టీ, బ్లాక్‌, ఇతర రకాల తేనీటి కషాయాలను రెండు నిమిషాలు మరిగించి, సాధారణంగా రోజూ తీసుకునే తేనీటి సరాసరితో పోల్చి చూశారు. ఆ మిశ్రమాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్లోరైడ్లను గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన లారా చౌన్‌ తెలిపారు. బ్లాక్‌ టీకి సంబంధించిన మిశ్రమాన్ని పరిశీలిస్తే లీటర్‌లో ఉండాల్సిన ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఫ్లోరైడ్‌ గాఢత ఉన్నట్లుగా గుర్తించారు
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.