02 October 2013

Tight waist belt may leads to Oesophgial cancer,బిగుతుగా బెల్ట్‌ పెట్టుకుంటే గొంతు క్యాన్సర్‌ ముప్పు




లండన్‌: నడుముకు అతి బిగుతుగా బెల్టు పెట్టుకునేవారికి గొంతు క్యాన్సర్‌ ముప్పు పొంచిఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ముఖ్యంగా వూబకాయులకు ఈ ప్రమాదం మరింత ఎక్కువని తెలిపింది. బరువు ఎక్కువగా ఉన్నవారు నడుముకు అతి బిగుతుగా బెల్టు ధరించడం వల్ల ఉదర ఆమ్లాలు వెనక్కివెళ్లి అన్నవాహికకు చేరుతాయని.. ఇది ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లాస్గో, స్ట్రత్‌క్త్లెడ్‌ వర్సిటీల పరిశోధకులు 24 మందిపై అధ్యయనం నిర్వహించి ఈ ఫలితాలు వెల్లడించారు. అధిక బరువుగల వారిలో ఉదర ఆమ్లాలు తిరిగి అన్నవాహికకు చేరినట్లు స్పష్టంగా గుర్తించారు. ''వూబకాయులు నడుముకు బిగుతుగా బెల్టు ధరించడం వల్ల ఉదరం, అన్నవాహికల మధ్య ఉన్న నాళంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఆమ్లాలు అన్నవాహికలోకి చేరుతాయి'' అని ముఖ్యఅధ్యయనకర్త కెన్నెత్‌ మెకోల్‌ తెలిపారు. ఉదరంలాగా ఆ ఆమ్లాలను అన్నవాహిక భరించలేదని.. ఈ పరిణామం గొంతు క్యాన్సర్‌కు దారితీస్తుందని వెల్లడించారు.(5:49 AM 10/2/2013)
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.