11 November 2013

Treatment for disease with patch,ప్యాచ్‌తో వ్యాధికి చికిత్స

  •  
  •  
లండన్‌: పలు అనారోగ్య సమస్యలకు చికిత్స అందించే విప్లవాత్మకమైన ప్యాచ్‌ను పరిశోధకులు రూపొందించారు. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలకు ఈ ప్యాచ్‌ చికిత్స అందజేస్తుంది. జపాన్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ప్యాచ్‌లో నుంచి ఔషధం నెమ్మదిగా చర్మం ద్వారా రక్తప్రసరణ వ్యవస్థలోకి కలుస్తుంటుంది. దీనిని బాధితులు భుజానికి, ఛాతీ, వీపు వద్ద అమర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓ బీటాబ్లాకర్‌ రకానికి చెందిన ఔషధం 'బైసోప్రొలాల్‌'ను క్రమబద్ధంగా అందజేస్తుంది. క్రమపద్ధతిలో నిరంతరంగా ఔషధం అందడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిని ఉపయోగించేందుకు ఇప్పటికే జపాన్‌లో అనుమతి లభించగా, రెండుమూడేళ్లలో బ్రిటన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ప్రతి ప్యాచ్‌లోనూ నాలుగు లేదా ఎనిమిది మిల్లీగ్రాముల మోతాదులో ఔషధం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వైఫల్యం, ఆందోళన, పార్శ్వనొప్పి వంటి వ్యాధుల్లో బీటా బ్లాకర్లను 50 ఏళ్లుగా వాడుతున్నారు. ఈ ప్యాచ్‌తో రక్తపోటు నియంత్రణ మెరుగవుతుందని వీటిని తయారు చేసిన జపాన్‌ సంస్థ నిటోడెంకో పేర్కొంది. ప్యాచ్‌ను ఉపయోగించినప్పుడు రక్తపోటు 24 గంటలపాటు స్థిరంగా ఉన్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది.
===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.