13 November 2013

pre-mature born baby suffer heart diseases, నెలలు నిండని బిడ్డలకు గుండె జబ్బు ముప్పు







వాషింగ్టన్‌: నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల్లో గుండె నిర్మాణ సంబంధ లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇవి.. భవిష్యత్‌లో హృద్రోగాలకు దారితీయొచ్చని వెల్లడైంది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియోవాస్క్యులర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు.. నెలలు నిండని 102 మంది శిశువులను వారు జన్మించినప్పటి నుంచి 20లలోకి అడుగుపెట్టేవరకూ పరిశీలించారు. గర్భం దాల్చాక 37వ వారంలోగా పుట్టినవారిని ఈ తరగతి కిందకి వర్గీకరించారు. నెలలు నిండాక జన్మించిన 132 మందితో వీరిని పోల్చి చూశారు. నెలలు నిండకుండా పుట్టినవారి గుండెలోని కుడివైపు దిగువ విభాగం చాలా చిన్నగా, బరువుగా ఉన్నట్లు గుర్తించారు. వీటి గోడలు మందంగా ఉండి, తక్కువ పంపింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తేల్చారు. శిశువు ఎంత ముందుగా పుడితే అంత ఎక్కువగా గుండెలోని ఈ భాగంపై ప్రభావం పడుతున్నట్లు ఇందులో వెల్లడైంది. నేటి యువతలో దాదాపు 10 శాతం మంది నెలలు నిండకుండానే జన్మించారని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ పాల్‌ లీసన్‌ తెలిపారు. 
=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.