07 November 2013

patch to Support to heart muscle,దెబ్బతిన్న గుండెకు పట్టీ అండ




వాషింగ్టన్‌: దెబ్బతిన్న గుండె కండరం వేగంగా కోలుకోవటానికి తోడ్పడే కొత్తరకం పట్టీని పరిశోధకులు సృష్టించారు. కండరాల్లో ఉండే ప్రోటీన్‌(కొలాజెన్‌)ను మార్పుచేసి కూర్చి దీనిని తయారుచేశారు. గుండె కండరం మీద అతికిస్తే దెబ్బతిన్న భాగం త్వరగా బాగవటానికిది తోడ్పడుతుంది. మన గుండె కండరం దెబ్బతింటే దానికి త్వరగా కోలుకునే సామర్థ్యం లేదు. అందువల్ల ఈ ప్రక్రియను ప్రోత్సహించటంపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ల్యూసైల్‌ పకార్డ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పరిశోధకులు మార్పుచేసిన కొలాజెన్‌తో కూడిన కొత్తరకం పట్టీని రూపొందించారు. దీన్ని ఎలుకల్లో దెబ్బతిన్న గుండె కండరంపై అతికించగా.. కొత్త కణాల పుట్టుక పుంజుకోవటమే కాదు, దెబ్బతిన్న భాగంలో రక్తనాళాలు కూడా పుట్టుకొచ్చినట్టు తేలింది. ఈ పట్టీ గుండె కండరంలో చనిపోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయటానికి బదులు.. గుండె కణజాలం పైపొర స్థానాన్ని ఆక్రమిస్తుంది. కండర కణజాలం కాకపోయినప్పటికీ ఈ పొర గుండె కండరానికి దన్నుగా నిలుస్తుంది. దాన్ని కాపాడుతుంది.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.