13 November 2013

New medicine for dimentia,మందమతికో 'ఐన్‌స్టీన్‌' పరీక్ష



వాషింగ్టన్‌: వృద్ధాప్యంలో రాబోయే మతిమరుపు (డైమెన్షియా) జబ్బును ముందుగానే గుర్తించగలిగేందుకు 'ఐన్‌స్టిన్‌' అనే చిన్న పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని షికాగోకు చెందిన పరిశోధకులు అంటున్నారు. 40 నుంచి 65 ఏళ్ల ప్రాయంలో ఈ పరీక్ష ద్వారా ఈ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించవచ్చట. ఇందుకోసం వీరికి ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, ఓప్రా విన్‌ఫ్రే, ప్రిన్సెస్‌ డయాన, జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లాంటి 20 మంది ప్రముఖుల నలుపు తెలుపు చిత్రాలను ముద్రించి వారిని గుర్తించే పరీక్ష ఇది. 62ఏళ్ల ప్రాయంలో ఉన్నవారిపై ఈ పరీక్ష నిర్వహించి అధ్యయనం చేశారు. ఈ పరీక్ష కోసం మందమతి జబ్బు ఉన్నవారు ఆ చిత్రాల్లో ఉన్నవారి పేర్లు ఎంతమంది గుర్తు పడతారు, గుర్తు పట్టకపోతే, ఆ వ్యక్తులకు సంబంధించి వారికేం తెలుసో రాయమని చెప్పి పరిశీలించినట్లు షికాగోలోని నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ ఫీన్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకుడు టామర్‌ జెఫెన్‌ తెలిపారు. పేరు గుర్తించడంలో ఇబ్బంది పడ్డవారు ఎడమ టెంపోరల్‌ లోబ్‌లోని మెదడు కణజాలం కోల్పోయినట్లు, ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది పడ్డవారిలో ఈ మెదడు కణజాలం రెండువైపులా కోల్పోయినట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించామని, దీని ఆధారంగా ముందస్తుగానే ఈ జబ్బును కనుగొనగలమని తెలిపారు.=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.