13 November 2013

Fish to cure joint pains,కీళ్ల నొప్పుల్ని తగ్గించే చేపలు





లండన్‌: చేపలు తినడం వల్ల దక్కే ప్రయోజనాల్లో మరొకటి వచ్చి చేరింది. సాల్మొన్‌ రకం చేపల్ని చేపల్ని కనీసం వారానికొకసారైనా తినడం వల్ల రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పు సగందాకా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 32 వేల మందికిపైగా స్వీడన్‌ మహిళలపై చేపట్టిన అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం 32 వేల మంది మహిళల ఆహార అలవాట్లను విశ్లేషించింది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను అధికంగా తీసుకున్న వారిలో కీళ్లనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా లభ్యమవుతుంది. రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌తో బాధపడుతున్న 27 శాతం మందిలో రోజుకు ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించారు. మొత్తానికి మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధకులు ప్రొఫెసర్‌ అలన్‌ సిల్మాన్‌ సూచిస్తున్నారు
=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.