07 November 2013

poverty may decrease intellicence,పేదరికం మేధోసామర్థ్యాన్ని తగ్గిస్తుంది

  •  
  •  
భారత్‌, అమెరికా అధ్యయనంలో వెల్లడి--
వాషింగ్టన్‌: సొమ్ములు తక్కువగా ఉంటే మేధోసామర్థ్యం కూడా తగ్గిపోతుందని తాజా అధ్యయనం చెబుతోంది. న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌ మాల్‌కి వచ్చేవారు, భారత్‌లోని రైతులపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు అంతర్జాతీయ పరిశోధక బృందం తెలిపింది. ఆర్థిక ఒత్తిడి వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయని చివరికి నిద్రలేని రాత్రులు గడుపుతుంటారని చెప్పింది. ''మా పరిశోధన పేదరికం గురించి కాదు. అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారనేది'' అని హార్వర్డ్‌ ఆర్థికవేత్త, పరిశోధక బృందం సభ్యుడు సెంథిల్‌ ముల్త్లెనాథన్‌ తెలిపారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వారు సొమ్ములు లేవన్న బాధతో ఉంటారని భావించాం.. కానీ వారిలో మేధో సామర్థ్యం తగ్గడం గుర్తించాం అని ఆయన వివరించారు. గడువు దాటిన చెల్లింపులు, అద్దె, రుణాలు వంటి వాటి గురించి అదే పనిగా ఆలోచించే వారి ఆలోచనలు ఇతర అంశాల మీదకు మళ్లుతున్నాయన్నారు. అధ్యయనంలో వేర్వేరు అంశాలపై వీరి ఐక్యూ పరీక్షించగా 13గా తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియా ప్రొఫెసర్‌ జియెంగ్‌ జావో తెలిపారు. అధ్యయనంలో భాగంగా సెంట్రల్‌ న్యూజెర్సీలోని క్వాకెర్‌ బ్రిడ్జ్‌ మాల్‌లో 400 మంది వినియోగదారులు, భారత్‌లోని 464 మంది చెరకు రైతులను పరిశీలించారు. ''న్యూజెర్సీలో 20వేల డాలర్లు ఆర్జించేవారిని 70వేల డాలర్లు ఆర్జించేవారితో పోల్చితే కారు మరమ్మత్తు బిల్లు చెల్లించడానికి పేద వర్గాలు ఎంతో ఆందోళన వ్యక్తంచేశాయి. భారత్‌లోని చెరకు రైతులు పంట వేయక ముందు పేదలుగా చేతికొచ్చాక ధనవంతులుగా భావించారు'' అని అధ్యయనంలో గుర్తించినట్లు జియెంగ్‌ పేర్కొన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.